Rhino Viral Video: ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. కారుకు ఎదురొచ్చిన ఖడ్గమృగం.. చివరకు..
ABN , Publish Date - Aug 20 , 2025 | 10:00 AM
కొందరు పర్యాటకులు ఓపెన్ టాప్ జీపులో జంగిల్ సఫారీకి వెళ్లారు. అడవిలోని అందమైన ప్రదేశాలు, పక్షులు, క్రూరమైన జంతువులను చూస్తూ సరదాగా గడుపుతున్నారు. ఇంతలో వారంతా షాక్ అయ్యో ఘటన చోటు చేసుకుంది.
జంగిల్ సఫారీ చూడ్డానికి ఎంత బాగుంటుందో.. కొన్నిసార్లు అంతే స్థాయిలో భయం కలిగిస్తుంటుంది. మరికొన్నిసార్లు దాదాపు ప్రాణం పోయినంత పనవుతుంటుంది. జంగిల్ సఫారీకి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం దర్శనమిస్తుంటాయి. తాజాగా, షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు పర్యాటకులు ఓపెన్ టాప్ జీపులో జంగిల్ సఫారీకి వెళ్లారు. అడవిలోని అందమైన ప్రదేశాలు, పక్షులు, క్రూరమైన జంతువులను చూస్తూ సరదాగా గడుపుతున్నారు. ఇంతలో వారంతా షాక్ అయ్యో ఘటన చోటు చేసుకుంది.
వాహనానికి ఎదురుగా దూరంగా ఓ ఖడ్గమృగం నిలబడి ఉంది. దాన్ని మరింత దగ్గరగా చూసేందుకు జీపు ముందుకు వెళ్లింది. అయితే జీపును చూడగానే ఖడ్గమృగానికి చిర్రెత్తుకొచ్చింది. ‘రోజూ నన్ను ఇబ్బంది పెట్టడడమే పనిగా పెట్టుకున్నారా.. మీ సంగతి చెబుతా ఉండండి’.. అన్నట్లుగా వారిపైకి దూసుకొస్తుంది. ఖడ్గమృగం దగ్గరికి రావడాన్ని చూసి జీపు డ్రైవర్.. వాహనాన్ని వెనక్కు నడుపుతాడు. అయినా ఖడ్గమృగం వారిని (Rhino chases tourist vehicle) వదలకుండా వెంటాడుతుంది. దీంతో జీపు డ్రైవర్ వెనక్కు ఎంతో వేగంతో వెళ్లాడు.
అయినా ఖడ్గమృగం చాలా దూరం వరకూ వారిని వెంటపడుతూనే ఉంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. చూస్తుంటేనే గుండె ఆగిపోయేలా ఉంది’.. అంటూ కొందరు, ‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1200కి పైగా లైక్‌లు, 1.17 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..
చిరుత ఎంత చురుకైనదో చూశారా.. చెట్టు పైనుంచి మాంసం పడిపోగానే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం