Optical illusion: ఈ వంటగదిలో ఎలుక దాక్కుని ఉంది.. 20 సెకన్లలో కనుక్కున్నారంటే మీ కళ్లు సూపర్‌గా ఉన్నట్లే..
ABN , Publish Date - Dec 06 , 2025 | 03:34 PM
ఇక్కడ మీకు ఓ వంట గది కనిపిస్తుంది. ఈ గదిలో అనేక వస్తువులు కనిపిస్తుంటాయి. అయితే ఈ వంట గదిలో ఓ ఎలుక దాక్కుని ఉంది. అదెక్కడుందో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకూ అందరినీ ఇవి తెగ ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. కొన్ని చిత్రాలు చూసేందుకు సాధారణంగా కనిపించినా.. అందులో అనేక పజిల్స్ దాగి ఉంటాయి. కొన్నిసార్లు వాటిని కనుక్కోవడం మన కళ్లకు పెద్ద సవాల్‌గా మారుతుంటుంది. అయినా చాలా మంది పదే పదే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. తాజాగా, మీ కోసం ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న వంటగదిలో ఓ ఎలుక దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో కనుక్కున్నారంటే.. మీ కళ్లు పవర్‌ఫల్‌గా ఉన్నాయని అర్థం.
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు ఓ వంట గది కనిపిస్తుంది. ఈ గదిలో అనేక వస్తువులు కనిపిస్తుంటాయి. ఆహారంతో కూడిన ప్లేట్లు, ఖాళీ వంట పాత్రలతో పాటూ మొక్కలతో కూడిన కుండీలు తదితర వస్తువులు కనిపిస్తుంటాయి.
అక్కడే ఉన్న కిటికీ బయట పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడి వరకూ అంతా ఓకే గానీ.. ఇక్కడే మీ కంటికి ఓ పరీక్ష పెడుతున్నాం. ఇదే చిత్రలో ఓ ఎలుక కూడా (Hiding Rat) దాక్కుని ఉంది. ఎవరూ చూడకుండా ఆహారం తినేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఆ ఎలుకను గుర్తించడం అంత సులభం కాదు. అలాగని అంత పెద్ద కష్టం కూడా కాదు.
కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇట్టే పసిగట్టేయవచ్చు. చాలా మంది ఆ ఎలుకను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ ఎలుక ఎక్కడుందో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి.
ఒకవేళ ఇప్పటికీ ఆ ఎలుకను గుర్తించడం మీ వల్ల కాకుంటే.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..
ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..
మరిన్ని పజిల్ చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..