Funny Viral Video: నిషేధిత ప్రాంతంలో సిగరెట్ తాగుతున్న వ్యక్తికి.. ఎవరు ఎలాంటి శిక్ష వేశారో చూస్తే..
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:40 PM
ఓ యువకుడు బహిరంగ ప్రదేశంలో డాల్ఫిన్ల నీటి కొలను ఎదురుగా నిలబడ్డాడు. చుట్టూ జనం ఉన్నా కూడా బహిరంగంగా సిగరెట్ వెలిగించాడు. గుప్పు గుప్పుమని పొగ ఊదుతూ సిగరెట్ తాగుతున్నాడు. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా.. చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. బహిరంగ ప్రదేశాల్లో జనం మధ్యలో ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ తాగుతూ వాతావరణాన్ని కలుషితం చేస్తుంటారు. వారు అనారోగ్యానికి గురికావడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. అయితే చాలా దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగితే శిక్షణ కఠినంగా ఉంటాయి. ఇలాంటి సంఘనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగుతున్న వ్యక్తి పరిస్థితి.. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన చైనాలోని (China) డాలియన్ నగరంలో చోటు చేసుకుంది. ఓ యువకుడు బహిరంగ ప్రదేశంలో డాల్ఫిన్ల నీటి కొలను ఎదురుగా నిలబడ్డాడు. చుట్టూ జనం ఉన్నా కూడా బహిరంగంగా సిగరెట్ వెలిగించాడు. గుప్పు గుప్పుమని (Man Smoking cigarette in Public Place) పొగ ఊదుతూ సిగరెట్ తాగుతున్నాడు. ఇంతలో ఓ మహిళ అతడి వద్దకు వచ్చి.. జనం మధ్యలో సిగరెట్ తాగడమేంటి... అని నిలదీసింది.
అయినా అతను ఏమాత్రం పట్టించుకోకుండా సిగరెట్ తాగుతూనే ఉన్నాడు. అయితే ఇదంతా వెనుక నీటిలో ఉన్న పెద్ద డాల్ఫిన్ గమనిస్తుంటుంది. బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగడాన్ని సహించని ఆ డాల్ఫిన్.. ఒక్కసారిగా నీటిలో నుంచి బయటికి వచ్చి, (Dolphin spraying water on man) అతడిపై నీటిని చిమ్ముతుంది. దీంతో సిగరెట్ ఆరిపోవడమే కాకుండా.. పూర్తిగా నీటిలో తడిచిపోయింది. ఇలా ఆ డాల్ఫిన్ సిగరెట్ తాగే వ్యక్తికి వింత శిక్ష వేసిందన్నమాట.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ డాల్ఫిన్ మామూలు శిక్ష వేయలేదుగా’.. అంటూ కొందరు, ‘ఇతడికి బాగా బుద్ధి చెప్పింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 65 వేలకు పైగా లైక్‌లు, 2.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..
పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి