Peacock Viral Video: యువతి సాయానికి ఫిదా అయిన నెమలి.. ఆహారం తినిపించగానే కృతజ్ఞతగా..
ABN , Publish Date - Dec 12 , 2025 | 09:20 AM
ఓ నెమలి నేలపై పడిన గింజలను వెతుక్కుని తింటోంది. ఇంతలో అక్కడికి వచ్చిన యువతి.. నెమలికి తన చేతిలోని గింజలను పెడుతుంది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
నెమలిని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. ఇక పురి విప్పి నాట్యం చేసే నెమలిని చూస్తే.. అలా చూస్తుండిపోవాలని అనిపిస్తుంటుంది. నెమలి నాట్యం ఎప్పుడెప్పుడు చేస్తుందా అని చాలా మంది వేచి చూస్తుంటారు. కొన్నిసార్లు నెమలి నాట్యం చేసే విధానం చూస్తే ఆశ్యర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ యువతి నెమలికి ఆహారం తినిపించింది. ఇందుకు కృతజ్ఞతగా నెమలి నాట్యం చేసి మరీ.. ఆమెకు థ్యాంక్స్ చెప్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ నెమలి నేలపై పడిన గింజలను వెతుక్కుని తింటోంది. ఇంతలో అక్కడికి వచ్చిన యువతి.. నెమలికి తన చేతిలోని (Peacock Feeding Seeds to Peacock) గింజలను పెడుతుంది. చేయి చాపగానే నెమలి దగ్గరికి వెళ్లి, ఆమె చేతిలోని గింజలను తినేసింది.
గింజలు తిన్న అనంతరం ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నట్లుగా.. నెమలి పురి విప్పి నాట్యం (Peacock Dance) చేసింది. నెమలి నాట్యం చూసి యువతి ఎంతో మురిసిపోయింది. ఇలా ఆ నెమలి ఆమెకు కృతజ్ఞతగా నాట్యం చేసి అలరించిందన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఈ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంది’.. అంటూ కొందరు, ‘ఈ నెమలికి కృతజ్ఞత బాగా ఎక్కువ’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17 వేలకు పైగా లైక్‌లు, 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..
పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి