Funny Viral Video: ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. సడన్‌గా భూకంపం.. చివరకు చూస్తే..
ABN , Publish Date - Dec 06 , 2025 | 08:38 PM
ఓ దుకాణం వద్ద చాలా మంది నిలబడి ఉంటారు. ఆ దుకాణంలో ఓ యువకుడు కుర్చీలో కూర్చుని తన ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అయితే ఇంతలో ఒక్కసారిగా భూకంపం వచ్చింది. చివరకు ఏమైందో మీరే చూడండి..
ప్రేమలో ఉన్న వారికి ప్రపంచంతో పని ఉండదు అని అంటారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పార్క్‌లు, బస్సులు, రైల్వే స్టేషన్లతో పాటూ ఆఖరికి రన్నింగ్ వాహనాలపై కూడా రాసలీలలు సాగించేవారిని చూస్తున్నాం. అలాగే ప్రేమికులు ఫోన్‌లో మాట్లాడుకునే సమయంలో చుట్టూ ఉన్న వారితో మాకేం పని అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా భూమి కంపించింది. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ దుకాణం వద్ద చాలా మంది నిలబడి ఉన్నారు. అక్కడే ఉన్న దుకాణంలో ఓ యువకుడు కుర్చీలో కూర్చుని (young man talking on the phone) తన ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అయితే ఇంతలో ఒక్కసారిగా భూకంపం (Earthquake) వచ్చింది. దీంతో అక్కడున్న వారంతా భయంతో అటూ, ఇటూ పరుగులు తీశారు.
అయితే ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి మాత్రం.. ఒకసారి అటూ, ఇటూ చూసి.. తనకేం సంబంధం లేదన్నట్లు అలాగే కూర్చున్నాడు. పైగా అతడిలో ఎలాంటి భయమూ కనిపించదు. ఎంతో తాపీగా ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నాడు. ఇతడి నిర్వాకం చూపరులను అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ప్రేమలో పడితే ఇలాగే ఉంటుంది మరి’.. అంటూ కొందరు, ‘ప్రపంచం ఏమైపోయినా ఇతడికి సంబంధం లేదు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..
పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి