Share News

Dangerous Stunt Video: గుండె ఆగిపోయే స్టంట్.. కారుతో ఇతను చేసిన విన్యాసాలు చూస్తే..

ABN , Publish Date - Dec 06 , 2025 | 05:19 PM

ఓ వ్యక్తి డేంజరస్ స్టంట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం రోడ్డు మధ్యలో టైర్లను ఒకదానిపై ఒకటి నిటారుగా ఎత్తుగా పెట్టారు. వాటిపైన వ్యక్తి నిలబడ్డాడు. మరో వ్యక్తి కారు స్టార్ట్ చేసుకుని ఎదురుగా ఉన్నాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..

Dangerous Stunt Video: గుండె ఆగిపోయే స్టంట్.. కారుతో ఇతను చేసిన విన్యాసాలు చూస్తే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది ఏదో రకంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు తెగ పోటీపడుతుంటారు. కొందరు ఎవరూ చేయని సాహసాలు ట్రై చేస్తే.. మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కారుతో చేసిన స్టంట్ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి డేంజరస్ స్టంట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం రోడ్డు మధ్యలో టైర్లను ఒకదానిపై ఒకటి నిటారుగా ఎత్తుగా పెట్టారు. వాటిపైన వ్యక్తి నిలబడ్డాడు. మరో వ్యక్తి కారు స్టార్ట్ చేసుకుని ఎదురుగా ఉన్నాడు. కారుతో ఆ టైర్స్‌ను ఢీకొట్టి ముందుకు వెళ్తే.. పైన ఉన్న వ్యక్తి జంప్ చేసి తప్పించుకోవాలి. ఇది వారు చేయబోయే స్టంట్. అనుకున్నట్లుగానే అంతా సిద్ధం చేశారు.


టైర్స్‌పై నిలబడ్డ వ్యక్తి ఓకే అనగానే (Man standing on car tires) .. కారు వేగంగా వెళ్లి టైర్స్‌ను ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లిపోయింది. కారు ఢీకొట్టగానే వాటిపై ఉన్న వ్యక్తి.. గాల్లోకి జంప్ చేసి పల్టీలు కొడుతూ కిందపడ్డాడు. అయితే వెనక్కు పల్టీలు కొట్టి రోడ్డుపై నిలబడాలనేది అతడి ఉద్దేశం. కానీ ఈ క్రమంలో అదుపుతప్పి ధబేల్‌మని కిందపడిపోయాడు. దెబ్బకు అతను పైకి లేవలేక చాలా సేపు విలవిల్లాడిపోయాడు. పొట్టపై చేతులు పెట్టుకుని అలాగే కూర్చున్నాడు. ఆ తర్వాత మెల్లిగా తేరుకుని.. దూరంగా ఉన్న వారికి విజయం సంకేతం చూపించాడు.


ఈ క్రమంలో ఏమాత్రం అటూ, ఇటూ అయినా అతడి ప్రాణాలే పోయేవి. అయితే అతడికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి స్టంట్స్ ఎవరూ చేయొద్దు’.. అంటూ కొందరు, ‘వీడియో చివరలో వచ్చిన వ్యక్తి.. అద్భుతమైన సాయం చేశాడు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 వేలకు పైగా లైక్‌లు, 5.41 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..

పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 06 , 2025 | 05:19 PM