Watch Video: వామ్మో.. గాల్లో దూసుకొచ్చిన కారు.. డివైడర్‌ను ఢీకొట్టగానే ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Dec 06 , 2025 | 07:51 PM
ఓ వ్యక్తి మెర్సిడెస్ కారులో నగరంలోకి ప్రవేశించాడు. అప్పటికే అతను వేగంగా వస్తున్నాడు. అయితే నగరంలోని కూడలిలోకి ప్రవేశించగానే.. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో..
సినిమా తరహా ప్రమాదాలు, స్టంట్స్ సీన్స్.. అప్పుడప్పుడూ నిజ జీవితంలోనూ చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు అయితే.. సినిమా సీన్లకు మించిన ఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటివి చూసినప్పుడు మనం కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. చాలా రోడ్డు ప్రమాదాలు చూసినప్పుడు ఇలాగే అనిపిస్తుంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో కొందరు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన రొమేనియాలో (Romania) చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మెర్సిడెస్ కారులో (Mercedes car) ఒరాడియా నగరంలోకి ప్రవేశించాడు. అప్పటికే అతను వేగంగా వస్తు్న్నాడు. అయితే నగరంలోని కూడలిలోకి ప్రవేశించగానే.. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి.. రోడ్డుపై ఉన్న వాహనాల మీదుగా దూసుకెళ్లి, అవతలి వైపు ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది.
అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద సమయంలో డ్రైవర్‌కు ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడని, దీంతో కారు అదుపు తప్పిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. డ్రైవర్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘సినిమా సీన్‌ను మించిపోయిందిగా’.. అంటూ కొందరు, ‘కారు ఫుట్‌బాల్‌లా దూసుకొచ్చిందిగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 72 వేలకు పైగా లైక్‌లు, 4.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..
పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి