Share News

Molestation on woman: ప్రేమ పేరుతో మోసం.. యువతిపై ముగ్గురు అత్యాచారం..

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:41 AM

ఈ మధ్య కాలంలో కొంతమంది యువకులు ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేయడం సర్వసాధారణం అయ్యింది. పెళ్లి చేసుకుంటామని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకొని అవసరం తీరాక వదిలేయడం, ఏకాంతంగా గడిపింది వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఓ యువతిని ముగ్గురు యువకులు ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి అత్యాచారం చేశారు.. వివరాల్లోకి వెళితే..

Molestation on woman: ప్రేమ పేరుతో మోసం.. యువతిపై ముగ్గురు అత్యాచారం..
ప్రతీకాత్మక చిత్రం

ఈ మధ్య కాలంలో కొంతమంది యువకులు ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేయడం సర్వసాధారణం అయ్యింది. పెళ్లి చేసుకుంటామని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకొని అవసరం తీరాక వదిలేయడం, ఏకాంతంగా గడిపింది వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి చేస్తు్న్నారు. ఓ యువతిని ముగ్గురు యువకులు ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి అత్యాచారం చేశారు.


నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నా.. నువు లేనిదే నేను లేను.. నీకోసం ప్రాణాలు ఇస్తా అంటూ ఓ యువతిని మోసం చేసి ముగ్గురు యువకులు వేర్వేరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన ఓ యువతికి కాలేజ్, బస్సు, ఆటోలో ముగ్గురు పరిచయం అయ్యారు. ఆ యువతితో మంచితనంగా నటించి రూమ్‌కి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆ యువతి అనంతపురంలో డిప్లమో సెకండ్ ఇయర్ చేస్తుంది. రోజూ బస్సు ప్రయాణం చేస్తూ కాలేజ్‌కి వెళ్తుంది. ఈ క్రమంలోనే మొదట పాతూరులోని ఆటో డ్రైవర్ అయిన గురు మోహన్‌తో పరిచయం అయ్యింది. అలా వారి పరిచయం ప్రేమగా మారింది.


ఈ నెల 2న ఆ యువతిని కాలేజ్ నుంచి పంపనూరుకు ఆటోలో తన ఇంటికి తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు మోహన్. మరుసటి రోజు ఆ యువతి తన సొంత ఊరుకి వెళ్లడానికి బస్సు ఎక్కించాడు. తాడిపత్రికి వెళ్లిన ఆ యువతి రాత్రి ఎక్కడికి వెళ్లావని కుటుంబ సభ్యులు నిలదీస్తారన్న భయంతో అప్పటికే బస్సులో పరిచయం అయిన ప్రదీప్ అనే యువకుడి షాప్ వద్దకు వెళ్లింది. ఆమె పరిస్థితి చూసి.. దాన్ని ఆసరాగా తీసుకొని తన రూమ్‌కి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు కడప బస్సు ఎక్కించి పంపించాడు. అయితే ఆ యువతి ఇంటికి వెళ్లేందుకు భయపడి తిరుపతికి వెళ్లింది.


అక్కడికి చేరుకున్న తర్వాత అప్పటికే కాలేజ్‌లో పరిచయం ఉన్న బ్రహ్మనాయుడు అనే యువకుడికి ఫోన్ చేసింది. యువతి వద్దకు వచ్చిన ఆ యువకుడు తన రూమ్ కి తీసుకువెళ్లాడు. నువు అంటే నాకు చాలా ఇష్టం, ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని నమ్మబలికాడు. అలా తన గదిలో నాలుగు రోజులు పాటు ఉంచుకొని అత్యాచారం చేశాడు. ఎక్కడికి వెళ్లినా తనపై అఘాయిత్యాలు జరగడంతో విసుగుపుట్టిన యువతి తాడిపత్రి పట్టణానికి చేరుకొని తన స్నేహితురాలి ఇంటికి చేరుకొని తన బాధ చెప్పుకొని అక్కడే ఉంది. అప్పటికే యువతి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. యువతి జాడ తెలుసుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ యువతి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి..

ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..

పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 12 , 2025 | 11:41 AM