Stunt Viral Video: కదిలే రైల్ డోర్ పట్టుకొని యువకుడి పుష్-అప్స్.. పట్టు వదిలితే పరలోకానికి పయనమే..
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:57 PM
ఈ మధ్య యువత సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే పిచ్చి కోరికతో తమ ప్రాణాలు పణంగా పెట్టి మరీ డేంజరస్ స్టంట్స్ చేస్తూ ప్రమాదాలు కోరి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కదిలే రైల్లో ఓ యువకుడు చేసిన స్టంట్ చూసి నెటిజన్లు షాక్ తిన్నారు.
ఈ మధ్య యువత సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే పిచ్చి కోరికతో తమ ప్రాణాలు పణంగా పెట్టి మరీ డేంజరస్ స్టంట్స్ చేస్తూ ప్రమాదాలు కోరి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కదిలే రైల్లో ఓ యువకుడు చేసిన స్టంట్ చూసి నెటిజన్లు షాక్ తిన్నారు.
సోషల్ మీడియాలో (Social Media) తక్కువ సమయంలో ఎక్కువ ఫేమస్ కావడానికి కొందరు ప్రమాదకరమైన రీల్స్ (Reels), వీడియోలు చేస్తూ చావు అంచుల్లోకి వెళ్తున్నారు. ప్రమాదం అని తెలిసినా యువతలో రోజు రోజుకీ రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోతుంది. ఇటీవల రీల్స్ కోసం కొంతమంది యువత రైళ్ల కింద పడుకోవడం, ఎత్తైన భవనాల నుంచి వేలాడటం, డేంజరస్ స్టంట్స్ (Dangerous Stunts) చేయడం, నీటి ప్రవాహాల వద్ద సాహసాలు చేయడం చూస్తున్నాం. ఇది లైక్స్, ఫాలోవర్స్ కోసమే అయినా.. కొన్నిసార్లు తమ ప్రాణాలకు ప్రమాదం అని గ్రహించలేకపోతున్నారు. తమ పిచ్చి విన్యాసాలతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి ఓ వైరల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
సాధారణంగా ఎవరైనా పుష్-అప్స్ (Push-ups) నేలపై కానీ, జిమ్ములో ఏదైనా రాడ్డు పట్టుకొని చేస్తుంటారు. కానీ, ఓ యువకుడు స్పీడ్ గా కదులుతున్న రైల్ డోర్ ని పట్టుకొని వేలాడుతూ పుష్-అప్స్ చేయడం చూసి అందరూ షాక్ తిన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ఆ యువకుడు చేసిన స్టంట్ చూస్తుంటే వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. రీల్స్ కోసం ఆ యువకుడు చేసిన వెర్రి చేష్టలను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం (Netizens Fire) వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో dankvjn అనే ఖాతా ద్వారా Instagramలో పోస్ట్ చేయబడింది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘రీల్స్ కోసం ప్రాణాలు రిస్క్ లో పెట్టడం అవసరమా? పట్టు వదిలితే పరలోకమే’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘పుష్ - ఆప్స్ చేయడానికి నీకు వేరే చోటే దొరకలేదా? చస్తావురా ’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశఆడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..
పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి