Tiger Funny Video: పులికి భయం అంటే ఏంటో చూపించిందిగా.. నీళ్లు తాగడానికి వెళ్లగానే..
ABN , Publish Date - Dec 25 , 2025 | 09:07 PM
ఓ పులి నీళ్లు తాగడానికి వెళ్లింది. ఇందులో భయపడడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. పులి నీళ్లు తాగడానికి వెళ్లిన దాంట్లో భయపడే సందర్భం లేకున్నా కూడా.. నీళ్లు తాగే సమయంలో జరిగిన ఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది..
బతికితే పులిలా బతకాలిరా.. అని పెద్దలు అంటుంటారు. పులి అంటేనే డేరింగ్ అండ్ డ్యాషింగ్‌కు ప్రతీక కాబట్టి.. అలా అంటుంటారు. పులిని చూస్తే భయమే తెలీదేమో అని అనుకుంటాం. కానీ పులి కూడా భయపడే సందర్భాలు చాలా ఎదురవుతుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నీళ్లు తాగడానికి వెళ్లిన పులి పరిస్థితి చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పులి నీళ్లు తాగడానికి వెళ్లింది. ఇందులో భయపడడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. పులి నీళ్లు తాగడానికి వెళ్లిన దాంట్లో భయపడే సందర్భం లేకున్నా కూడా.. నీళ్లు తాగే సమయంలో జరిగిన ఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. తీరా నీళ్లు తాగే సమయంలో ఓ మొసలి నీటిలో నుంచి ఒక్కసారిగా పైకి లేచి పులిని పట్టుకునేందుకు ప్రయత్నించింది.
మొసలి ఒక్కసారిగా బయటికి రావడంతో (Crocodile tries to attack tiger) పులికి భయంతో వణికిపోయింది. పరుగు పరుగున అక్కడి నుంచి దూరంగా పారిపోయింది. కాస్తలో మొసలి బారి నుంచి ప్రాణాలతో బయటపడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పులికి భయం అంటే ఏంటో చూపించిందిగా’.. అంటూ కొందరు, ‘ఈ పులి ఎంతో లక్కీగా ఉన్నట్టుందే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 140కి పైగా లైక్‌లు, 6 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. మొసలిని ఎలా కనిపెట్టాడో చూడండి..
కొండపై దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు.. సడన్‌గా దూసుకొచ్చిన సింహం.. చివరకు చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..