Share News

Lion Viral Video: కొండపై దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు.. సడన్‌గా దూసుకొచ్చిన సింహం.. చివరకు చూస్తే..

ABN , Publish Date - Dec 24 , 2025 | 09:15 PM

కొండపై భక్తులు ఆలయాల సందర్శనకు వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సడన్‌గా సింహం దూసుకురావడంతో అంతా భయంతో పరుగులు తీశారు. చివరకు ఏమైందో మీరే చూడండి..

Lion Viral Video: కొండపై దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు.. సడన్‌గా దూసుకొచ్చిన సింహం.. చివరకు చూస్తే..

అటవీ సమీప ప్రాంతాల్లోకి క్రూర మృగాలు చొచ్చుకురావడం తరచూ చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో అప్పుడప్పుడూ జంతువులు, మనుషులు కూడా వాటికి బలవుతుంటారు. అయితే కొన్నిసార్లు కొందరు వాటి బారి నుంచి తృటిలో తప్పించుకుంటుంటారు. ఇలాంటి అరుదైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు భక్తులు కొండపై దైవ దర్శనానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో సడన్‌గా ఓ సింహం అటుగా వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గుజరాత్‌ (Gujarat) పాలిటానాలోని శత్రుంజయ్ పర్వతంపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కొండపై సుమారు100 వరకూ జైన ఆలయాలు ఉన్నాయి. వీటిని దర్శించేందుకు ఏటా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. అయితే ఇటీవల భక్తులు కొండపైకి వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


మార్గ మధ్యలో అడవిలో నుంచి ఓ సింహం.. సడన్‌గా మెట్ల (Lion that came up the hill) మార్గం వైపు వచ్చింది. మెట్ల పైకి వచ్చి నిలబడింది. సింహాన్ని చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. అయితే మెట్ల పైకి వచ్చిన సింహం.. ఆ తర్వాత మార్గానికి అవతలి వైపు ఉన్న అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో భక్తులంతా హమ్మయ్య.. అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సింహం వచ్చిన సందర్భంలో అక్కడున్న వారు వీడియోలు తీశారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ భక్తులను ఆ దేవుడే కాపాడాడు’.. అంటూ కొందరు, ‘వామ్మో చూస్తుంటేనే భయంగా ఉంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా లైక్‌లు, 1.55 లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..

పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 24 , 2025 | 09:15 PM