Home » Gujarat
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఘటనలో ధైర్యంగా వ్యవహరించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర పురస్కారాన్ని ప్రకటించింది.
అమెరికాలో స్థిరపడాలని ఆశతో బయలుదేరిన గుజరాత్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు విదేశాల్లో అదృశ్యమయ్యారు. వీరిని అపహరించినట్టు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ రావడం, రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇటీవల భారత కోస్టు గార్డు దళాలకు భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు చిక్కాయి. సెప్టెంబర్ 25న అరేబియా సముద్రం మీదుగా పడవలో రూ.3 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను తరలిస్తూ ఐదుగురు పాకిస్థానీలు చిక్కారు.
క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు, డేటా సెంటర్లలో పెట్టుబడులకు ఏపీ ఎంతో సానుకూలమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ అన్నారు. శుక్రవారం అహ్మదాబాద్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని ఆహ్వానించారు.
వికసిత్ భారత్ నిర్మాణంలో ఏపీ మెయున్ గ్రోత్ ఇంజన్‌గా నిలవాలని కోరుకుంటోందని, ఇందుకు పెట్టుబడిదారులు మద్దతుగా నిలవాలని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేశ్ కోరారు. శుక్రవారం అహ్మదాబాద్‌లో సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ రోడ్‌షోలో పాల్గొన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఏపీ మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. గురువారం గాంధీనగర్‌కు చేరుకున్న లోకేశ్ నేరుగా భూపేంద్ర నివాసానికి వెళ్లారు. తీరప్రాంత రాష్ట్రాల అభివృద్ధి, పారిశ్రామిక నియంత్రణ సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి కీలక జాతీయ విధాన చర్చల్లో ఏపీ, గుజరాత్ ఏకతాటిపై ఉండాలని కోరారు.
భారీ విగ్రహాలతో సందడి చేసే వినాయక చవితిలో.. సూరత్‌కు చెందిన ఓ కళాకారుడు అందుకు భిన్నంగా అతి చిన్న గణపయ్యను తీర్చిదిద్దాడు. కేవలం 6 మిల్లీమీటర్ల విగ్రహాన్ని పెన్సిల్ మొనపై చెక్కి అబ్బురపరిచాడు.
గుజరాత్‌లోని సూరత్‌లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లు భావించారు. అయితే ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టిన ఘటనగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
గుజరాత్‌లో బోన్ మ్యారో మార్పిడి కోసం చేపట్టిన వైద్య పరీక్షల్లో ఊహించని మలుపు తిరిగింది. కుమారుడి బోన్ మ్యారో భర్తకు సరిపోలకపోవడంతో భార్య పోలీసులను ఆశ్రయించారు.
దేశీయ సెమీకండక్టర్ తయారీకి మరింత ఊతమిచ్చేలా కీలక ముందడుగు వేసింది భారత్. సెమీకాన్ ఇండియా-2026లో భాగంగా.. పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లోని రెండు ప్లాంట్లలో వాణిజ్య ఉత్పత్తిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.