కారు ప్రమాదంలో నలుగురి మృతి.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 21 , 2026 | 09:04 AM
అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ప్రాణాలు పోతాయని అధికారులు ఎన్నిసార్లు సూచించినా యువత పెడచెవిన పెడుతున్నారు. హ్యాపీగా బర్త్‌డే పార్టీ చేసుకున్న నలుగురు యువకులు వేగంగా కారు నడిపి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఘటనా సంబంధిత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకెళితే...
అహ్మదాబాద్‌లో తమ స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా నలుగురు స్నేహితులు కలిశారు. బర్త్‌డే పార్టీ చేసుకుని కారులో బయలుదేరారు. కారు 140 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ.. చేతిలో సిగరెట్‌తో ఎంజాయ్ చేస్తున్నాడు డ్రైవర్. మితిమీరిన వేగంతో డ్రైవ్ చేస్తున్నాడంటూ.. సహచరులు హెచ్చరిస్తున్నా అతడు వినలేదు. ఇంతలో ఎదురుగా మరో వాహనం రావడంతో వేగాన్ని అదుపుచేయలేక దాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు.. మహ్మద్ అయాన్(17), ఆదిల్ ఖురేషి(14), షేర్ మొహమ్మద్(19), గులాం ఖ్వాజా(17) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు కారులో ఉన్న యువకులు రికార్డు చేసిన వీడియో.. నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇవి కూడా చదవండి
ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు విశాఖ ఉత్సవ్: హోంమంత్రి అనిత
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్.. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ఈయూ చీఫ్