మదర్ ఆఫ్ ఆల్ డీల్స్.. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ఈయూ చీఫ్
ABN , Publish Date - Jan 20 , 2026 | 09:41 PM
ఈయూ-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారయ్యే దశలో ఉందని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ తెలిపారు.
న్యూఢిల్లీ: భారత్-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ (Ursula von der Leyen) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈయూ-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారయ్యే దశలో ఉందని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వెల్లడించారు. భారీ వాణిజ్యం, దాని ప్రభావం రీత్యా ఈ ఒప్పందాన్ని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా ఆమె అభివర్ణించారు. ఈ ఒప్పందం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక డీల్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.
'ఈ ఒప్పందం దిశగా ఇంకా చేయాల్సిన వర్క్ ఉంది. మనం చారిత్రక ఒప్పందం కుదుర్చుకునే దిశగా మందుకు సాగుతున్నాం. కొందరు దీనిని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా చెబుతున్నారు. ఈ డీల్‌తో 200 కోట్ల మంది ప్రజలకు వస్తువులు, సేవల ఎగుమతి-దిగుమతులకు వీలుంటుంది. ఇది ప్రపంచ జీడీపీలోనే 25 శాతానికి సమానం' అని లియెన్ తెలిపారు.
ఇండియా-ఈయూ వాణిజ్య ఒప్పందంపై చర్యలు 2007లో మొదలయ్యాయని, అయితే సుమారుగా పదేళ్లుగా నిలిచిపోయాని ఆమె చెప్పారు. రెండు వైపుల నుంచి రాజకీయ సపోర్ట్‌తో తిరిగి 2022లో సంప్రదింపులు ప్రారంభమయ్యాయని, అప్పటి నుంచి చాలా వేగంగా చర్చల్లో పురోగతి ఉందని, ఇండియా-ఈయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సహకారంతో క్రమం తప్పకుండా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
కాగా, గ్రీన్‌లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని నాటో మిత్రదేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల 10 శాతం అదనపు సుంకాలను ప్రకటించారు. తమ దారికి రాకుంటే మరో 25 శాతం సుంకాలు పెంచుతామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత్-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని ఉర్సాలా ప్రకటించడం ప్రాధాన్యత సంచరించుకుంది. వచ్చే వారం ఆమె భారత్‌లో పర్యటించే అవకాశాలున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
అబూ సలేంకు పెరోల్ ఇవ్వొద్దు.. ముంబై కోర్టుకు తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం
నితిన్ నబీన్‌కు జడ్ కేటగిరీ సెక్యూరిటీ
Read Latest National News