నితిన్ నబీన్‌కు జడ్ కేటగిరీ సెక్యూరిటీ
ABN , Publish Date - Jan 20 , 2026 | 03:23 PM
బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత కల్పించింది. దీంతో ఆయన పాల్గొనే అన్ని అధికారిక కార్యక్రమాల్లో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఆయనకు పహారాగా ఉంటారు.
న్యూఢిల్లీ: బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్(Nitin Nabin)కు కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత(Z category Security) కల్పించింది. దీంతో ఇకపై ఆయనకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) కమాండోలు రక్షణ కవచంగా ఉంటారు. నితిన్ నబీన్‌కు భద్రత కల్పించాలని కొద్దివారాల క్రితం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఆ ప్రకారం ఆయన దేశవ్యాప్తంగా పర్యటించేటప్పుడు, బహిరంగ సభల్లో పాల్గొనేటప్పుడు, ఆయన నివాసం వద్ద సీఆర్‌పీఎఫ్ సిబ్బంది 24 గంటలూ పహారాగా ఉంటారు.
ఐదుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన 45 ఏళ్ల నితిన్ నబీన్.. ఆ పదవిని స్వీకరించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఆయన ముందు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాకూ జడ్ కేటగిరీ భద్రతనే కేంద్రం కేటాయించింది. సీఆర్‌పీఎఫ్ వీఐపీ సెక్యూరిటీ వింగ్ ఆయన భద్రతా ఏర్పాట్లు చూసుకునేది. వీఐపీ సెక్యూరిటీ కవర్ కింద కేంద్రం రక్షణ కల్పించే కేటగిరిల్లో అత్యున్నత కేటగిరి జడ్-ప్లస్(ASL) కాగా.. తక్కిన కేటగిరిల్లో జడ్ ప్లస్, జడ్, వై, వై-ప్లస్, ఎక్స్ కేటగిరీలు ఉన్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, గాంధీ ఫ్యామిలీ సభ్యులతో సహా 200 మంది వీఐపీలకు సీఆర్‌పీఎఫ్ భద్రత కల్పిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి.
బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవం.. అతి పిన్న వయస్కుడిగా రికార్డు
జాతీయ గీతం ఆలపించలేదని.. అసెంబ్లీ నుంచి తమిళనాడు గవర్నర్ వాకౌట్..
Read Latest National News