ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు విశాఖ ఉత్సవ్: హోంమంత్రి అనిత
ABN , Publish Date - Jan 20 , 2026 | 09:43 PM
విశాఖపట్నం ప్రజలకు, ఎన్డీఏ కూటమికి అవినాభావ సంబంధం ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీనే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు.
విశాఖపట్నం, జనవరి20(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ప్రజలకు, ఎన్డీఏ కూటమికి అవినాభావ సంబంధం ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీనే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో భిన్న వాతావరణం ఉంటుందని తెలిపారు. అనకాపల్లి జిల్లా వైభవం చాలా గొప్పదని చెప్పుకొచ్చారు. ఈనెల 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన కర్టెన్ రైజ్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో లోగో, టీ షర్ట్, ఈవెంట్ బ్రోచర్స్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అనిత, కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్ర, బాల వీరాంజనేయ స్వామి, సంధ్యారాణి ఎంపీ, ఎమ్మెల్యేలు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత ప్రసంగించారు. ఏకకాలంలో విశాఖపట్నం, అనకాపల్లిలో ఈ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాగరం నుంచి శిఖరం వరకు టైటిల్‌తో.. ఇండియాస్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వివరించారు. ఏటికొప్పాక బొమ్మలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయని వివరించారు. ఈ ఉత్సవాల్లో ప్రజలు పోలీసులకు సహకరించాలని హోంమంత్రి అనిత సూచించారు.
ఉత్సవ్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు: మంత్రి కొల్లు రవీంద్ర

మూడు జిల్లాల్లో విశాఖ ఉత్సవ్‌ను అద్భుతంగా డిజైన్ చేశారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో చీకటి రోజులు ఉన్నాయని తెలిపారు. విశాఖలో యోగా డే గిన్నిస్ రికార్డ్ సాధించిందని వెల్లడించారు. విశాఖ ఉత్సవ్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
మరింత అందంగా అరకును చూపిస్తాం: మంత్రి గుమ్మడి సంధ్యారాణి

తాగితే ఆరుకు కాఫీ తాగాలి, తింటే అనకాపల్లి బెల్లం తినాలని.. చూస్తే విశాఖ ఉత్సవ్‌ను చూడాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అరకు అందాలను మరింత అందంగా చూపించేలానే ప్రయత్నంతో విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ ఉత్సవ్‌ను మూడు జిల్లాల ప్రజలు విజయవంతం చేయాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు.
బీచ్ ఫెస్టివల్‌గా బ్రాండింగ్ చేస్తున్నాం: పల్లా శ్రీనివాసరావు

విశాఖ ఉత్సవ్‌ను దేశంలోనే పెద్ద బీచ్ ఫెస్టివల్‌గా బ్రాండింగ్ చేస్తున్నామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. సంక్రాంతి ఘనంగా చేసుకున్నామని అన్నారు. విశాఖ ఉత్సవ్ ఘనంగా నిర్వహించుకోవడానికి అందరూ సహకరించాలని కోరారు. విశాఖ ఉత్సవ్‌లో స్థానిక కళాకారులకు అవకాశం కల్పించాలని సూచించారు. స్థానికంగా ఉన్న వంటకాలను విశాఖ ఉత్సవ్‌లో ప్రోత్సహించాలని పల్లా శ్రీనివాసరావు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు
మహిళా కానిస్టేబుల్‌ను అభినదించిన హోం మంత్రి అనిత
For More AP News And Telugu News