మహిళా కానిస్టేబుల్‌ను అభినందించిన హోంమంత్రి అనిత
ABN , Publish Date - Jan 20 , 2026 | 03:23 PM
కాకినాడలోని కెనాల్ రోడ్డులో గత శనివారం భారీ ట్రాఫిక్ జామ్ కాగా.. మహిళా కానిస్టేబుల్ జయశాంతి దానిని క్లియర్ చేశారు. ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందిస్తూ.. ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
అమరావతి, జనవరి20(ఆంధ్రజ్యోతి): మహిళా కానిస్టేబుల్ జయశాంతికి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anita) అభినందనలు తెలిపారు. కాకినాడలోని కెనాల్ రోడ్డులో గత శనివారం భారీ ట్రాఫిక్ జామ్ అవ్వగా.. దానిని కానిస్టేబుల్ జయశాంతి క్లియర్ చేశారు. ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందిస్తూ.. ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
ప్రజలకు మరింత నమ్మకం...
జయశాంతి లాంటి పోలీసుల వల్ల ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని మంత్రి అనిత తెలిపారు. జయశాంతి కుటుంబం యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు అనిత. ఈ క్రమంలో తాను హోంమంత్రిని కలుస్తానని జయశాంతి చెప్పారు. త్వరలోనే కలుద్దామని హోం మంత్రి చెప్పారు. ఈ సంఘటన మహిళా పోలీసుల సాహసాన్ని, విధి నిర్వహణలో వారి పాత్రను ప్రదర్శించే ఒక మంచి ఉదాహరణగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు.
బిడ్డను చంకనెత్తుకుని..
కాకినాడలోని కెనాల్ రోడ్డులో శనివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. సామర్లకోట వద్ద ఓ లారీ సాంకేతిక సమస్య కారణంగా రైల్వే గేట్ సమీపంలో రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో సుమారు ఐదారు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమయంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి రంగంపేటకు చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి విధి నిర్వహణలో లేకపోయినా తన బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యూఏఈ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
గొడ్డలితో కేక్ కటింగ్.. వీడియో వైరల్.. రంగంలోకి దిగిన పోలీసులు
For More AP News And Telugu News