Share News

New RTI Commissioners Take Oath: సీఎస్ నేతృత్వంలో ఆర్టీఐ నూతన కమిషనర్ల ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:50 PM

ఏపీ సమాచార హక్కు కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త సారథులను నియమిస్తూ.. ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన సమాచార కమిషనర్‌గా ప్రముఖ న్యాయవాది వజ్జా శ్రీనివాసరావును ఎంపిక చేసింది.

New RTI Commissioners Take Oath: సీఎస్ నేతృత్వంలో ఆర్టీఐ నూతన కమిషనర్ల ప్రమాణ స్వీకారం

అమరావతి, జనవరి 20: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీఐ నూతన కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో వారిచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ఆర్టీఐ చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాస రావు ప్రమాణం చేశారు. అనంతరం.. పరవాడ సింహాచలం నాయుడు, వంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, శరత్ చంద్ర కళ్యాణ చక్రవర్తి వట్టికూటిలు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఆర్టీఐ ఉన్నతాధికారులు, నూతన కమిషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్ర సమాచార హక్కు(ఆర్టీఐ) కమిషన్‌కు ఏపీ ప్రభుత్వం కొత్త సారథులను నియమిస్తూ.. ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన సమాచార కమిషనర్‌గా ప్రముఖ న్యాయవాది వజ్జా శ్రీనివాసరావును ఎంపిక చేసింది. అలాగే మరో నలుగురు వి.శరత్ చంద్ర కల్యాణ్ చక్రవర్తి, గాజుల ఆదెన్న(అనంతపురం), ఒంటేరు రవిబాబు(కడప), పరవాడ సింహాచలం నాయుడు(విశాఖపట్నం) సమాచార కమిషనర్లుగా నియమిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. నూతనంగా నియమితులైన వారంతా న్యాయవాదులే. వీరంతా.. మూడేళ్లు లేదా వారికి 65 ఏళ్లు వచ్చే వరకు(ఏది ముందైతే అది) ఈ పదవిలో కొనసాగనున్నారు.


ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులతో కూడిన సెలెక్షన్ కమిటీ చేసిన సిఫార్సులకు గవర్నర్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ నియామకాలను ఖరారు చేస్తూ.. ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ కమిషన్‌లో ఇప్పటికే ముగ్గురు సభ్యులు ఉండగా.. తాజా నియామకంతో కమిషన్‌లో సభ్యుల సంఖ్య పెరిగింది. ఈ నియామకాలతో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుల పరిష్కారం వేగవంతం అవుతుందని.. ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత మెరుగవుతుందని సర్వత్రా ఆశాభావం వ్యక్తమవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

యూఏఈ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

గొడ్డలితో కేక్ కటింగ్.. వీడియో వైరల్.. రంగంలోకి దిగిన పోలీసులు

For More AP News And Telugu News

Updated Date - Jan 20 , 2026 | 01:32 PM