Share News

World Economic Forum 2026: జ్యూరిక్‌లో సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం

ABN , Publish Date - Jan 20 , 2026 | 08:02 AM

స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు. దావోస్ సదస్సులో మొదటి రోజు వివిధ రంగాలకు చెందిన కంపెనీల పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు.

World Economic Forum 2026: జ్యూరిక్‌లో సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం

హైదరాబాద్, జనవరి 20: దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు-2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం.. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం ప్రతినిధి బృందానికి జ్యూరిక్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు. దావోస్ సదస్సులో మొదటి రోజు వివిధ రంగాలకు చెందిన కంపెనీల పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశంల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. తెలంగాణ రైజింగ్-2047 రోడ్ మ్యాప్‌ను ఈ ఆర్థిక సదస్సులో పారిశ్రామికవేత్తలకు ఈ సీఎం ప్రతినిధి బృందం వివరించనుంది.


తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకున్న అనుకూలతలను వారికి వివరించడంపై సీఎం రేవంత్ ప్రతినిధి బృందం ఇప్పటికే దృష్టి సారించింది. గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచిన అభివృద్ధి నమూనాకు అనుగుణంగా సుస్థిర పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. దావోస్‌లో నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు సీఎం రేవంత్‌, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్ చేరుకున్న సంగతి తెలిసిందే.


ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. ఆ రోజు సాయంత్రం ములుగు జిల్లాలోని మేడారానికి ఆయన చేరుకున్నారు. అనంతరం కేబినెట్ సమావేశం నిర్వహించారు. స్థానికంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. సోమవారం ఉదయం సమ్మక్క, సారలమ్మలను సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని.. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు ప్రతినిధుల బృందం బయలుదేరి వెళ్లింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పిల్లనివ్వండి..! పెళ్లి కోసం వినూత్న ఫ్లెక్సీ

ఏపీలో స్విస్‌ పెట్టుబడులకు సహకరించండి

For More TG News And Telugu News

Updated Date - Jan 20 , 2026 | 01:30 PM