Share News

CM Chandrababu: యూఏఈ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:41 AM

దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా యూఏఈ మంత్రితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు ప్రాంతాలకు సంబంధించిన పలు అంశాలపై వీరు చర్చించారు.

CM Chandrababu: యూఏఈ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

అమరావతి, జనవరి 20: దావోస్‌లో వివిధ దేశాల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు వరుస భేటీలతో బిజీ బిజీగా ఉంటున్నారు. తాజాగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో సీఎం చంద్రబాబు మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆహారం, మల్టీ మోడల్ లాజిస్టిక్స్, ఇంధనం, ఓడరేవులు, రిటైల్ రంగాలు వంటి సహకారంపై చర్చించినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారాయన. అందుకు సంబంధించిన ఫొటోలను సైతం అందులో ఉంచారు.


ఆదివారం రాత్రి.. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం చంద్రబాబుతో కూడిన ప్రతినిధి బృందం దావోస్‌కు బయలుదేరి వెళ్లింది. ఈ ప్రతినిధి బృందానికి యూరప్‌లోని ఎన్నార్టీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం.. వారితో సమావేశమయ్యారు. అలాగే.. స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి సైతం ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయనతో చంద్రబాబు సమావేశమయ్యారు.


అలాగే పలు దేశాల నేతలు, మంత్రులతో పాటు ఉన్నతాధికారుల ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు. సంబంధిత ఫొటోలను తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు పోస్ట్ చేస్తున్నారు. ఈ సదస్సు ఐదు రోజుల పాటు జరగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలితో కేక్ కటింగ్.. వీడియో వైరల్.. రంగంలోకి దిగిన పోలీసులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

For More AP News And Telugu News

Updated Date - Jan 20 , 2026 | 04:37 PM