AP News: లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా పదివేల మందికి ఇళ్ల పట్టాలు
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:40 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, రాష్ట్రమంత్రి లోకేశ్ పుట్టినరోజునాడు ఆయా కార్యక్రమాలు నిర్వహించేలా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా పదివేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు స్థానిక టీడీపీ నేతలు తెలిపారు.
- 23వ తేదీన పంపిణీ
మడకశిర(అనంతపురం): పదివేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) పుట్టినరోజు సందర్భంగా ఈనెల 23వ తేదీన పట్టణంలో పట్టాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Anagani Satyaprasad) చేతుల మీదుగా వాటిని అందజేయనున్నట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి(Gundumala Tippeswami) తెలిపారు.
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన సభాస్థలిని ఆయన సోమవారం పరిశీలించారు. పండుగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఒక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, నగర పంచాయతీ అధ్యక్షుడు నరసింహరాజు, రాష్ట్ర మైనారిటీ డైరెక్టర్ బక్తర్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..
ఏపీలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి
Read Latest Telangana News and National News