Share News

ఏపీలో ఆర్ఎంజడ్ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు..

ABN , Publish Date - Jan 20 , 2026 | 08:31 PM

ఏపీలో ఆర్ఎంజడ్ గ్రూప్ లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో దావోస్‌లో ఆర్ఎంజడ్ గ్రూప్ ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు దావోస్‌లో ఆర్ఎంజడ్ చైర్మన్ మనోజ్ మెండాతో మంత్రి లోకేశ్ జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి..

ఏపీలో ఆర్ఎంజడ్ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు..
RMZ Group Investment

ఇంటర్నెట్ డెస్క్, జనవరి20(ఆంధ్రజ్యోతి): ఏపీలో ఆర్ఎంజడ్ గ్రూప్ (RMZ Group Investment) రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దావోస్‌లో మంత్రి లోకేశ్ సమక్షంలో ఆర్ఎంజడ్ ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు దావోస్‌లో ఆర్ఎంజడ్ చైర్మన్ మనోజ్ మెండాతో మంత్రి లోకేశ్ జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. విశాఖపట్నం కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్‌లో సుమారు 50 ఎకరాల్లో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో GCC పార్క్‌ను అభివృద్ధి చేయడానికి ఆర్ఎంజడ్ గ్రూప్ అంగీకారం తెలిపింది. దావోస్‌లో జరిగిన 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఆర్ఎంజడ్ చైర్మన్ మనోజ్ మెండా ఈ వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యంపై ప్రకటన విడుదల చేశారు. ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మిక్స్ డ్ యూజ్, డిజిటల్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని వ్యాఖ్యానించారు.


రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక, లాజిస్టిక్స్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూనే, విశాఖపట్నాన్ని నెక్ట్స్ జెన్ మిక్స్డ్ యూజ్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా మార్చాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఆర్ఎంజడ్ పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. విశాఖపట్నం ప్రాంతంలో దశలవారీగా 1 గిగావాట్ వరకు లక్ష్య సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్‌ ఏర్పాటుకు కూడా ఆర్ఎంజడ్ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు. దీనికి విశాఖపట్నం ప్రాంతంలో సుమారు 500 నుంచి 700 ఎకరాల భూమి అవసరమని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ నెక్ట్స్ జెన్ డిజిటల్, ఏఐ వర్క్ లోడ్‌కు మద్దతుగా ఉంటుందని తెలిపారు.


స్థిరత్వం, గ్రీన్ పవర్ ఇంటిగ్రేషన్‌‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. రాయలసీమలో టేకులోడు వద్ద ఆర్ఎంజడ్ గ్రూప్ సుమారు 1,000 ఎకరాల్లో పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్క్‌ను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో పారిశ్రామిక తయారీ, గిడ్డంగులు, లాజిస్టిక్స్ కార్యకలాపాలను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులన్నింటిపై కలిపి రాబోయే ఐదేళ్లలో ఆర్ఎంజడ్ సంస్థ సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు వివరించారు. దీని ద్వారా ఐటీ, డేటా సెంటర్లు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాల్లో సుమారు లక్ష మందికి ఉపాధి లభిస్తోందని వెల్లడించారు. సింగిల్ విండో విధానం ద్వారా కాలపరిమితులతో కూడిన అనుమతులు కావాలని చెప్పుకొచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ఏపీ ప్రభుత్వం తమ కమిట్‌మెంట్‌ను మరోసారి స్పష్టం చేసిందని మనోజ్ మెండా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు

మహిళా కానిస్టేబుల్‌ను అభినదించిన హోం మంత్రి అనిత

For More AP News And Telugu News

Updated Date - Jan 20 , 2026 | 09:04 PM