అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం.. వైసీపీ ఫేక్ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం ఫైర్..
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:58 PM
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావించింది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో వైసీపీ దుష్ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది..
అమరావతి, జనవరి20(ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో(Amaravati) ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో వైసీపీ దుష్ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో కులాల మధ్య వైసీపీ చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తింది. ఫేక్ ఐడీలతో వైసీపీ సోషల్ మీడియా టీమ్ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలుగు ప్రైడ్ థీమ్‌తో ఎన్టీఆర్ విగ్రహం..
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు నిధుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అమరావతిలో తెలుగు ప్రైడ్ థీమ్‌తో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. గుజరాత్ ప్రైడ్ పేరుతో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో తెలుగు ప్రైడ్ పేరుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది. టూరిజాన్ని ఆకర్షించేలా.. ఎన్టీఆర్ విగ్రహం, ఫ్యూచర్ మ్యూజియం వంటివి ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
పీపీపీ పద్ధతిలో..
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, పార్కును పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేలా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని నీరుకొండ గ్రామస్తులు కూడా కోరారని ప్రభుత్వం స్పష్టం చేసింది. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ వ్యవహరిస్తే... చర్యలు తీసుకోవాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు గత జగన్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని కూటమి నేతలు గుర్తుచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళా కానిస్టేబుల్‌ను అభినదించిన హోం మంత్రి అనిత
నాలెడ్జ్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తోంది: సీఎం చంద్రబాబు
For More AP News And Telugu News