కల్తీ మద్యం కేసులో జోగి సోదరులకు బెయిల్..
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:14 PM
ఏపీ కల్తీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముకి విజయవాడ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. 6వ AJMFC కోర్టు భవానీపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో వీరిద్దరికి బెయిల్ మంజూరు చేసింది.
విజయవాడ, జనవరి20(ఆంధ్రజ్యోతి): ఏపీ కల్తీ మద్యం తయారీ కేసులో(AP Fake Liquor Case) మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముకు విజయవాడ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. 6వ AJMFC కోర్టు భవానీపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో వీరిద్దరికి బెయిల్ మంజూరు చేసింది.
కేసు వివరాలిలా..
జోగి రమేశ్, జోగి రాము.. భవానీపురంలో నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిద్దరూ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో ఏ18గా జోగి రమేశ్, ఏ19గా జోగి రాము పేర్లు ఉన్నాయి. అయితే.. ములకల చెరువు కేసులో ఇంకా జోగి రమేశ్‌కు బెయిల్ రాలేదు. దీంతో జైల్లోనే జోగి సోదరులు ఇంకా జైల్లోనే ఉండనున్నారు.
ఆస్పత్రిలో చికిత్స..
అంతకుముందు.. జోగి రమేశ్‌ను విజయవాడ జిల్లా జైలు నుంచి చెయ్యి నొప్పి కారణంగా ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. నకిలీ మద్యం తయారీకి సంబంధించి జోగి రమేశ్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో జోగి సోదరులను నిందితులుగా పోలీసులు చేర్చారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులు జోగి సోదరులను విచారించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణ ఆధారంగా పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళా కానిస్టేబుల్‌ను అభినదించిన హోం మంత్రి అనిత
గొడ్డలితో కేక్ కటింగ్.. వీడియో వైరల్.. రంగంలోకి దిగిన పోలీసులు
For More AP News And Telugu News