Share News

గ్రేట్ గ్రీన్ వాల్‌ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌పై డిప్యూటీ సీఎం ఆదేశాలివే..

ABN , Publish Date - Jan 20 , 2026 | 03:26 PM

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలోని సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతి, అమలు వివరాలపై ప్రధానంగా చర్చించారు.

గ్రేట్ గ్రీన్ వాల్‌ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌పై డిప్యూటీ సీఎం ఆదేశాలివే..
Deputy CM Pawan Kalyan

అమరావతి, జనవరి 20: గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్ట్‌లపై సంబంధిత అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని గ్రేట్ గ్రీన్ వాల్ 2030 నాటికి రాష్ట్రంలోని 1,034 కి.మీ తీరప్రాంతంలో 5 కిలోమీటర్ల వెడల్పు గ్రీన్ బెల్ట్‌‌గా ఏర్పడి ప్రధాన పర్యావరణ ప్రాజెక్ట్‌గా రూపాంతరం చెందాలని పవన్ ఆదేశించారు. ఇది తుఫాన్‌లు, సముద్ర మట్టం పెరుగుదల, కోత నుంచి రక్షించడానికి ‘జీవన పర్యావరణ కవచం’ను ఏర్పరుస్తుందని ఆయన అన్నారు.


ఈ నిర్ణయం అమలయితే.. జీవవైవిధ్యం, జీవనోపాధిని పెంచుతుందని ఆకాంక్షించారు. ఆఫ్రికన్ గ్రేట్ గ్రీన్ వాల్ చొరవ నుంచి ప్రేరణ పొందిందని.. మడ అడవులు, సరుగుడు, ఇతర ఉప్పునీటిని తట్టుకునే చెట్ల తోటలపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బుదితి రాజశేఖర్, కృష్ణ బాబు సహా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలెప్మెంట్ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

తదుపరి దర్యాప్తు అవసరముందా?: వివేకా హత్య కేసులో సీబీఐని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

రికార్డ్ స్థాయి ఆదాయం.. చరిత్ర సృష్టించిన ఏపీఎస్‌ఆర్టీసీ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 20 , 2026 | 04:37 PM