Share News

Supreme Court: తదుపరి దర్యాప్తు అవసరముందా?: వివేకా హత్య కేసులో సీబీఐని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:38 AM

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో తదుపరి విచారణ అవసరమని భావిస్తున్నారా.. అంటూ సీబీఐని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

Supreme Court: తదుపరి దర్యాప్తు అవసరముందా?: వివేకా హత్య కేసులో సీబీఐని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
Supreme Court

న్యూఢిల్లీ, జనవరి 20: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(Former Minister Viveka Case) విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎవరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని అనుకుంటున్నారో చెబితే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని సీబీఐకి సుప్రీం కోర్టు(Supreme Court) తెలిపింది. ఇదే అంశంపై విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది న్యాయస్థానం. వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు. సునీత పిటీషన్‌పై జస్టిస్ ఎంఎం.సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది.


ముందుగా.. సునీత తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ట్రయల్‌ కోర్టుకు వెళ్లామని.. అక్కడ తదుపరి దర్యాప్తు అవసరమని పిటిషన్‌లో తాము పేర్కొన్న అంశాల్లో ఏ ఒక్కటీ ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదన్నారు. అంతేకాకుండా పిటిషన్‌లో పేర్కొనని అంశాలను పరిగణలోకి తీసుకుని పరిమితమైన మేరకే పాక్షికంగా దర్యాప్తునకు అనుమతి ఇచ్చారని.. అది న్యాయబద్ధం కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వివేకా కేసును పాక్షికంగా దర్యాప్తునకు అనుమతించడమేంటి.. అని లూథ్రా ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు.


ఈ సందర్భంగా.. జస్టిస్ ఎంఎం.సుందరేశ్ జోక్యం చేసుకుని.. వివేకా హత్య కేసులో తదుపరి విచారణ అవసరమని భావిస్తున్నారా? అని సీబీఐని ప్రశ్నించింది. ఏయే అంశాలపై తదుపరి విచారణ అవసరమో స్పష్టంగా చెప్పాలని సీబీఐని కోరింది. ఎవరిని కస్టడీలోకి తీసుకొని విచారించాలని అనుకుంటున్నారో కూడా చెబితే దాన్ని పరిగణలోకి తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో ఇంకా ఎవరినైనా విచారించాల్సిన అవసరముందా అనేది ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ను అడిగి చెప్పగలమని.. దీనికి రెండు వారాల సమయం కావాలని సీబీఐ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం.


ఇవి కూడా చదవండి...

డైవర్షన్ కోసమే నోటీసులు.. సీఎం రేవంత్‌పై హరీశ్ ఫైర్

దారుణం... తల్లిపై కొడుకు కత్తితో దాడి

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 20 , 2026 | 12:08 PM