Home » YS Viveka
వివేకా కేసులో అరెస్ట్ అయిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి నేడు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. 12 రోజుల పాటు భాస్కర్‌రెడ్డి కి ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది. భాస్కర్ రెడ్డి అనారోగ్యంగా ఉన్నట్టు కోర్టుకు చంచల్‌గూడ సూపరింటెండెంట్ రిపోర్ట్ ఇచ్చారు.
హైదరాబాద్: వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఈ నెల 13వ తేదీన తీర్పు విలువరించనుంది.
సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కేసు విచారణ నేడు జరిగింది. లాయర్ సిద్ధార్ధ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాలని సుప్రీంను వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే...
వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పును వెలువరించింది. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు చుక్కెదురైంది. నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ కుమార్ రెడ్డిల బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే సీబీఐ కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేయడంతో హైకోర్టుకి వెళ్లారు.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని హత్య చేయడానికి కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి,
వివేకా హత్య కేసులో నేడు సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టుకి హాజరు కావడం ఇది రెండో సారి. ఇప్పటికే వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
మాజీ మంత్రి వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన A4 దస్తగిరి మినహా అందరినీ పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు. భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి తదితరులను కోర్టు ముందు హాజరు పరచడం జరిగింది. అయితే విచారణకు ముందుగా ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు ఆయన సీబీఐ కోర్టుకి చేరుకున్నారు. గత నెల 14న కోర్టుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని సిబీఐకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 18 కి వాయిదా వేసింది.