Share News

PM Modi: సోమనాథ్‌ శౌర్యయాత్రలో ప్రధాని.. కాన్వాయ్‌ వెంట 108 అశ్వాలు..

ABN , Publish Date - Jan 11 , 2026 | 01:44 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్ లోని ప్రసిద్ధ సోమనాథ్ మహాదేవుడి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన శౌర్యయాత్రలో ప్రధాని మోదీ పాల్గొన్నారు..

PM Modi: సోమనాథ్‌ శౌర్యయాత్రలో ప్రధాని.. కాన్వాయ్‌ వెంట 108 అశ్వాలు..
PM Modi Gujarat visit

జాతీయం, ఆంధ్రజ్యోతి: ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ మహాదేవుడి(Somnath Temple) ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సోమనాథ్‌ స్వాభిమాన్‌ పర్వ్‌లో భాగంగా నిర్వహించిన శౌర్యయాత్రలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విదేశీ దురాక్రమణదారుల నుంచి సోమనాథ్‌ ఆలయాన్ని కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన వీరులకు గుర్తుగా ఏటా ఈ శౌర్యయాత్ర(Shourya Yatra)ను నిర్వహిస్తుంటారు.


ఈ సంవత్సరం కూడా శౌర్యయాత్రను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సారి ప్రధాని నరేంద్ర మోదీ (Modi Gujarat visit 2026) ఈ యాత్రలో పాల్గొన్నారు. శౌర్య యాత్రలో భాగంగా మోదీ ఆ యోధులకు నివాళులర్పించారు. ఈ యాత్రకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు, మోదీ.. మోదీ అని నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ఇక ఇక్కడ ఏర్పాటు చేసిన 108 గుర్రాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వాటిని ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. శౌర్య యాత్రలో భాగంగా ఆలయం వైపు వెళ్తున్న మోదీకి అశ్వాలే ఎస్కార్ట్‌గా మారినట్లు ఆ దృశ్యం కనిపించింది. అనంతరం మోదీ సోమ్‌నాథ్‌ ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు.


ఇవీ చదవండి:

ముసుగు ధరించి వస్తే గోల్డ్ విక్రయించం.. వర్తకుల కీలక నిర్ణయం..

ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..

Updated Date - Jan 11 , 2026 | 01:58 PM