Husband Goes Missing: ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..
ABN , Publish Date - Jan 11 , 2026 | 09:35 AM
ఓ మహిళ 2021లో తన భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న మోహన్ రాజ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అతడికి కూడా అంతకుముందే పెళ్లైంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు..
ఓ వ్యక్తి తన భార్య బతికుండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో బిడ్డను కూడా కన్నాడు. చివరికి ఆమె నుంచి లక్షల రూపాయల డబ్బులు కాజేసి ముఖం చాటేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బనశంకరికి చెందిన ఓ మహిళ 2021లో తన భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న మోహన్ రాజ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అతడికి కూడా అంతకుముందే పెళ్లైంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు. 2022లో ఈ ఇద్దరికీ పెళ్లి జరిగింది. 2023లో ఆ మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది.
ఇంటి నిర్మాణం కోసం అని చెప్పి మోహన్ రాజ్ తన రెండో భార్య నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. ఆమె తన నగలు తాకట్టు పెట్టి ఏకంగా రూ.35 లక్షలు ఇచ్చింది. రోజులు గడిచే కొద్దీ.. మోహన్ రాజ్‌లో మార్పు రాసాగింది. అతడు రెండో భార్యను దూరం పెట్టాడు. ఆమె దగ్గరికి వెళ్లడమే మానేశాడు. దీంతో ఆ మహిళ అతడి ఇంటికి వెళ్లింది. తనకు న్యాయం కావాలని అడిగింది. అయినా అతడు ఆమెను పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో మోహన్ రాజ్‌పై నాలుగు సార్లు ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పోలీసులు మోహన్ రాజ్‌పై కేసు నమోదు చేయకపోగా తనపైనే బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది.
మోహన్ రాజ్ మాటలు విని పోలీసులకు ఇలా చేస్తున్నారని బాధితురాలు అనుమానం వ్యక్తం చేసింది. మహిళ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై బాధితురాలు మాట్లాడుతూ.. ‘మోహన్ రాజ్‌కు చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయి. అతడు వారికి పాడు మెసేజ్‌లు పెడుతూ ఉంటాడు. అతడి ఫోన్‌లో నేను వారి ఫొటోలు కూడా చూశాను. అతడు పెళ్లికి ముందు.. పెళ్లి అయిన తర్వాత కూడా నాకు అబార్షన్ చేయించాడు. నా మొదటి భర్త సంతానాన్ని బాగా కొట్టేవాడు’ అంటూ ఆవేదన వ్యక్తి చేసింది.
ఇవి కూడా చదవండి..
మీ దృష్టి గొప్పదైతే.. ఈ కుర్రాడి బెడ్రూమ్‌లోని చేపను 7 సెకెన్లలో కనిపెట్టండి!
శరీరానికి వేడి కలగాలంటే ఈ పండ్లు తినాల్సిందే మరి...