Kerala MLA Arrest: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యే అరెస్ట్..
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:27 AM
కేరళలో ఓ బహిష్కృత ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు పోలీసులు. వరుస అత్యాచార ఫిర్యాదుల నేపథ్యంలో అతణ్ని పాలక్కాడ్‌లో కస్టడీలోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: కేరళలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్(Congress) బహిష్కృత ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్ అరెస్ట్(MLA Rahul Mamkootathil Arrested) అయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున పాలక్కాడ్‌లోని కేపీఎం రీజెన్సీ హోటల్ నుంచి అతణ్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. త్వరలో రాహుల్‌ను మేజిస్ట్రేట్ మందు హాజరు పరుస్తామని తెలిపారు. ప్రస్తుతం.. కెనడాలో పనిచేస్తున్న పతనంతిట్టకు చెందిన ఓ యువతి.. మామ్‌కుటత్తిల్‌పై మూడో అత్యాచార ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసులు ఈ చర్యలకు ఉపక్రమించారు.
రాహుల్ మామ్‌కుటత్తిల్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ గతంలో ఓ నటి సహా మరో యువతి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యేపై అత్యాచార సంబంధిత కేసులు నమోదయ్యాయి. ఆ కేసులపై మామ్‌కుటత్తిల్ ముందస్తు బెయిల్ పొందారు. అయితే.. తాజాగా మరో యువతి కూడా అతడు తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆరోపించింది. అంతేకాకుండా.. తన గర్భాన్ని తొలగించుకోవాలని బెదిరించాడని కూడా ఆమె పేర్కొంది. రాజకీయంగా అతడికి పలుకుబడి ఉండటంతో ఇన్నాళ్లూ పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని ఆమె వాపోయింది. అయితే.. ఆ ఎమ్మెల్యేపై అత్యాచార కేసులు నమోదయ్యాయని తెలియడంతో.. తానూ ఫిర్యాదు చేసినట్టు స్పష్టం చేసిందామె. దీంతో పరారీలో ఉన్న బహిష్కృత ఎమ్మెల్యే(Expelled MLA) మామ్‌కుటత్తిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి:
ముసుగు ధరించి వస్తే గోల్డ్ విక్రయించం.. వర్తకుల కీలక నిర్ణయం..
ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..