Home » Rape case
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన మరువక ముందే.. బిహార్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఒక నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది.
లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో నాటకీయ పరిస్థితుల నడుమ చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నారు.
తన పై అధికారి తన మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని వాయుసేనకు చెందిన ఒక మహిళాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జమ్ము కశ్మీర్లోని బుద్గాం పోలీస్ స్టేషన్లో నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు.
కోల్కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.
అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన బిల్లును పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆమోదించనుంది. ఇందుకోసం సోమవారంనాడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చింది. ప్రతిపాదిత బిల్లుకు ''అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండమెంట్) బిల్లు 2024''గా పేరు పెట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కక్షిదారులకు సత్వర న్యాయం అందాలంటే కోర్టుల్లోని ‘వాయిదాల సంస్కృతి’ని మార్చాల్సి ఉందని ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు.
కోల్కతాలో ట్రైనీ డాక్టరుపై అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటనను తక్కువ చేసి చూపారంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తప్పుపట్టారు.
మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వరమే న్యాయం అందాల్సి ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. అలా అయితేనే భద్రతపై వారికి మరింత భరోసా ఇచ్చినట్టవుతుందని అన్నారు.
కోల్కతా ఆర్జీకర్ వైద్య కాలేజీలో పీజీ వైద్యవిద్యార్థిని మృతిచెందిన విషయం ఆ ఘటనపై కేసు నమోదయ్యేంత వరకూ తనకు తెలియదని ఆ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చెప్పారు.