Machavaram POCSO Case: బాలికపై అత్యాచారం కేసులో నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
ABN , Publish Date - Dec 09 , 2025 | 10:18 PM
పల్నాడు జిల్లా మాచవరం పరిధిలో 2021లో ఓ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో తాజాగా తీర్పు వెలువడింది. నిందితునికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
పల్నాడు జిల్లా, డిసెంబర్ 09: మాచవరం(Machavaram) పరిధిలో నాలుగేళ్ల క్రితం ఓ మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కేసులో తాజాగా తీర్పు వెలువరించింది పోక్సో న్యాయస్థానం(POSCO Court). బాలికపై అత్యాచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. నిందితుడు సాయి(Accused Sai)కి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో పాటు అతడికి రూ.10వేల జరిమానా కూడా విధిస్తూ తీర్పునిచ్చారు పోక్సో జడ్జి శ్రీమతి వేల్పుల భవాని(Judge Velpula Bhavani).
ఇదీ కేసు..
మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు నాలుగేళ్ల క్రితం ఓ మైనర్‌కు ప్రేమ పాఠాలు చెప్పి నమ్మించసాగాడు సాయి అనే వ్యక్తి. అనంతరం.. ఆ బాలికను ఓ హోటల్ రూమ్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 2021లో ఈ ఘటన జరిగింది. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టిన మాచవరం పోలీసులు.. అన్ని రకాల ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. ఈ కేసును పక్కా సాక్ష్యాలతో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పై విధంగా తీర్పునిచ్చింది.
ఇవీ చదవండి: