IndiGo Back on its Feet: ఇండిగో సేవలు గాడిన పడుతున్నాయి.. మమ్మల్ని క్షమించండి: సీఈఓ
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:45 PM
ఇండిగో పరిస్థితులు సాధారణ స్థితికి చేరాయని ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు. కొద్ది రోజులుగా ఆ సంస్థలో తలెత్తిన ఇబ్బందుల వల్ల ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారాయన.
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో(IndiGo).. సంక్షోభ(crisis) పరిస్థితుల నుంచి బయటపడి సాధారణ స్థితికి చేరుకుందని ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్(IndiGo CEO Pieter Elbers) తెలిపారు. ఇండిగో సంస్థలో తలెత్తిన ఇబ్బందుల వల్ల.. అత్యవసర పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వేల మంది ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు(IndiGo Crisis). ఈ విషయమై క్షమాపణలు కోరారు సీఈఓ.
ఇండిగో విమాన సర్వీసుల్లో(IndiGo Flight Services) ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని పీటర్ ఎల్బర్స్(Pieter Elbers) హామీ ఇచ్చారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇండిగో విమానయాన సిబ్బంది అంతా తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రయాణికులే తమ తొలి ప్రాధాన్యమని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత కొన్ని రోజులుగా విమాన సర్వీసులు రద్దవడంతో.. ఇప్పటికే లక్షలాది మంది ప్రయాణికులకు రీఫండ్(Refunds) చెల్లింపు ప్రక్రియ పూర్తి చేశామని సీఈఓ పేర్కొన్నారు. అలాగే సదరు ప్రయాణికులకు చెందిన లగేజీ సైతం వారి నివాసాలకు చేరవేశామని తెలిపారు. మిగిలిన మరికొన్ని బ్యాగేజీలనూ త్వరలోనే ఆయా ఇళ్లకు చేరుస్తామని, దీనికోసం తగిన ఏర్పాట్లు చేశామని ప్రకటించారు.
తీవ్ర ఇబ్బందుల నడుమ.. డిసెంబర్ 5న 700 ఫ్లైట్లను మాత్రమే నడపగలిగామని సీఈఓ వెల్లడించారు. అయితే.. సోమ, మంగళవారాల్లో పరిస్థితులు కాస్త మెరుగవ్వడంతో మొత్తం 1800 విమానాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం.. 138 గమ్య స్థానాలకు ఇండిగో ప్రయాణాలు కొనసాగుతున్నాయన్న ఆయన.. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం(Central Govt)తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. కేంద్రంతో పూర్తి సహకారంతో ముందడగు వేస్తున్నట్టు తెలిపారు ఎల్బర్స్.
ఇవీ చదవండి: