Share News

పెళ్లైన రెండు నెలలకే విషాదం.. భార్యను చంపి.. అనంతరం భర్త ఆత్మహత్య

ABN , Publish Date - Jan 23 , 2026 | 06:10 PM

బుధవారం అహ్మదాబాద్‌లో విషాదకరమైన సంఘటన జరిగింది. రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న ఓ వ్యక్తి తన భార్యను కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పెళ్లైన రెండు నెలలకే విషాదం.. భార్యను చంపి.. అనంతరం భర్త ఆత్మహత్య
Ahmedabad traged,

ఇంటర్నెట్ డెస్క్: బుధవారం రాత్రి గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్‌లో(Ahmedabad Crime News) విషాదకరమైన సంఘటన జరిగింది. రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న ఓ వ్యక్తి తన భార్యను కాల్చి చంపి, ఆ తర్వాత వారి అపార్ట్‌మెంట్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను గుజరాత్ మారిటైమ్ బోర్డ్‌లో క్లాస్-1 అధికారి యశ్‌రాజ్‌సిన్హ్ గోహిల్, అతని భార్య రాజేశ్వరి గోహిల్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


అహ్మదాబాద్‌లో జడ్జెస్ బంగ్లా రోడ్‌లోని ఎన్‌ఆర్‌ఐ టవర్‌లోని యశ్‌రాజ్‌సిన్హ్,రాజేశ్వరి నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి వారి అపార్ట్‌మెంట్ లోపల వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో యశ్‌రాజ్‌సిన్హ్ తన లైసెన్స్ పొందిన రివాల్వర్‌ను ఉపయోగించి రాజేశ్వరిపై కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్ ఆమె మెడలోకి దూసుకెళ్లడంతో రక్తపు మడుగులో పడిపోయింది. కాల్పుల తర్వాత యశ్‌రాజ్‌సిన్హ్ అంబులెన్స్ కు సమాచారం ఇచ్చాడు. వైద్య సిబ్బంది అపార్ట్‌మెంట్‌కు చేరుకుని రాజేశ్వరిని పరీక్షించించి.. ఆమె మరణించినట్లు తెలిపారు.


అత్యవసర సిబ్బంది, పోలీసులు ఫ్లాట్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత యశ్‌రాజ్‌సిన్హ్ మరో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. యశ్‌రాజ్‌సిన్హ్ మరొక గదిలోకి వెళ్లి అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గుజరాత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ శక్తి సిన్హ్ గోహిల్ మేనల్లుడు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషి ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. అయితే వీరి మరణాలకు గల బలమైన కారణాలు ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు(Ahmedabad police investigation) చేస్తున్నారు.


ఇవీ చదవండి:

బ్రెజిల్‌ ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నా: ప్రధాని మోదీ

తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్‌ భారత్‌

Updated Date - Jan 23 , 2026 | 06:15 PM