బ్రెజిల్ ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నా: ప్రధాని మోదీ
ABN , Publish Date - Jan 23 , 2026 | 05:23 AM
బ్రెజిల్ అధ్యక్షుడు లుల డ సిల్వాకు స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వచ్చే నెలలో లుల భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో గురువారం మోదీ ఆయనతో మాట్లాడారు.
న్యూఢిల్లీ, జనవరి 22: బ్రెజిల్ అధ్యక్షుడు లుల డ సిల్వాకు స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వచ్చే నెలలో లుల భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో గురువారం మోదీ ఆయనతో మాట్లాడారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై ముచ్చటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం సుదృఢంగా సాగుతోందని, వచ్చే ఏడాది నూతన శిఖరాలను అధిరోహిస్తుందంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. రెండు దేశాలూ ట్రంప్ టారి్‌ఫల బారిన పడడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.