రిపబ్లిక్ డేకు ముందు.. ఆ స్కూళ్లకు బాంబు బెదిరింపులు.!
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:56 PM
రిపబ్లిక్ డేకు ముందు.. పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నొయిడా, అహ్మదాబాద్‌లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: గణతంత్ర దినోత్సవానికి ముందు దేశ వ్యాప్తంగా భద్రతా దళాలు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర్ ప్రదేశ్ నొయిడాలోని శివనాడార్ పాఠశాల సహా గుజరాత్ అహ్మదాబాద్‌లోని సెయింట్ కబీర్, సెయింట్ జేవియార్ పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చాయి. ఈ విషయమై వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ముమ్మర తనిఖీలు చేపట్టారు. పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో పాటు సెలవు ప్రకటించి విద్యార్థులను ఇంటికి పంపించారు.
పాఠశాలల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్‌లు క్షుణ్నంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ప్రాథమిక తనిఖీల అనంతరం ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. ఇటీవల ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎక్కువ అవుతున్నాయని, సంఘ విద్రోహులు సహా కొంతమంది ఆకతాయిలే ఇలాంటి కాల్స్ చేసి బెదిరిస్తున్నారన్నారు. సదరు బెదిరింపు కాల్, ఇ-మెయిల్ ఎక్కడ నుంచి వచ్చాయన్న విషయాన్ని తెలుసుకునే దిశగా ఐటీ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు.
ఇవీ చదవండి:
బ్రెజిల్ ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నా: ప్రధాని మోదీ
తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్