ఆస్ట్రేలియాలో మళ్లీ కాల్పుల కలకలం ముగ్గురు మృతి
ABN , Publish Date - Jan 23 , 2026 | 05:24 AM
సిడ్నీ ఉగ్రదాడి ఘటన మరువక ముందే అస్ట్రేలియాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూ సౌత్‌వేల్స్ రాష్ట్రంలోని లేక్ కార్గిలిగో పట్టణంలో గురువారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
మెల్‌బోర్న్, జనవరి 22: సిడ్నీ ఉగ్రదాడి ఘటన మరువక ముందే అస్ట్రేలియాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూ సౌత్‌వేల్స్ రాష్ట్రంలోని లేక్ కార్గిలిగో పట్టణంలో గురువారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సుమారు 1500 జనాభా ఉన్న ఆ చిన్న పట్టణంలో తుపాకీ శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. కాల్పులకు తెగబడిన దుండగుడు భారీ తుపాకీతో ఇంకా నగరంలోనే ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. గతేడాది డిసెంబర్ 14న సిడ్నీ బోండి బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన 15మంది మృతులకు నివాళిగా దేశవ్యాప్తంగా సంతాపదినం పాటిస్తున్న రోజే.. ఈ కాల్పులు జరగడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.