viral video: చెప్పుతో కొడుతూ.. బూతులు తిడుతూ.. యువకుడిపై ట్రాన్స్ జెండర్ల దాష్టికం
ABN , Publish Date - Dec 12 , 2025 | 01:40 PM
దేశంలోని పలు రైల్వే స్టేషన్స్ లో ట్రాన్స్ జెండర్లు బెదిరించి డబ్బులు వసూల్లు చేయడం, బండబూతులు తిడుతూ దాడులకు తెగబడటం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఓ రైల్వే స్టేషన్‌లో బేంచ్ పై పడుకున్న యువకుడిని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ అవుతుంది.
దేశంలోని పలు రైల్వే స్టేషన్స్ లో ట్రాన్స్ జెండర్లు బెదిరించి డబ్బులు వసూల్లు చేయడం, బండబూతులు తిడుతూ దాడులకు తెగబడటం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఓ రైల్వే స్టేషన్‌లో బేంచ్ పై పడుకున్న యువకుడిని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ అవుతుంది.
ఈ మధ్య కాలంలో ట్రాన్స్ జెండర్లు చేస్తున్న పనుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు పలు ప్రభుత్వాలు ట్రాన్స్ జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు ట్రాన్స్ జెండర్ల ఆగడాలు, దాడులు మితిమీరిపోతున్నాయి. ఓ రైల్వే స్టేషన్ (railway station)లో బెంచ్ పై పడుకున్న ఓ యువకుడిని ముగ్గురు ట్రాన్స్ (Transgenders) జండర్లు చెప్పుతో దాడి (Attack with Sandal) చేస్తున్న వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వైరల్ వీడియోలో ఓ యువకుడు రైల్వే స్టేషన్ లోని ఓ బెంచ్ పై నిద్రిస్తున్నాడు. హఠాత్తుగా అక్కడికి ముగ్గురు ట్రాన్స్ జెండర్లు వచ్చారు. వారిలో ఓ ట్రాన్స్ జెండర్ ఆ యువకుడిని లేపి తిడుతూ చెప్పుతో కొడుతుంది. ఏం జరుగుతుంతో అర్థం కాక ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ అవుతూ.. నన్ను ఎందుకు కొడుతున్నారు అని ప్రశ్నించాడు. అంతలోనే మరో ట్రాన్స్ జెండర్ అతన్ని చెంపపై కొడుతుంది. ఇంత జరుగుతున్నా పక్క నుంచి ప్రయాణికులు వెళ్తున్నారే కానీ.. ఏం జరిగిందని ప్రశ్నించడం లేదు. చివరికి.. ఆ యువకుడు భయంతో అక్కడ నుంచి పారిపోతుండగా అతన్ని వెంబడించారు.
వరాహ వారియర్ అనే యూజర్ X లో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం (Netizens Serious) వ్యక్తం చేస్తున్నారు. రాను రాను రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులకు భద్రత లేకుండా పోతుందని.. పోలీసులు ఇలాంటి ఘటనలపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం తెలుసుకోవడానికి స్టేషన్ పేరు, బాధితుడి కాంటాక్ట్ నెంబర్, వివరాలు పంపించాల్సిందిగా రైల్వే పోలీసులు (Railway Police) ప్రజలను కోరారు. ఇందులో పాల్గొన్న వ్యక్తులను గుర్తిస్తూ పోలీసులు లేదా రైల్వే అధికారులు ప్రకటనలు జారీ చేయలేదు.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..
పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి