Crocodile Viral Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. మొసలిని ఎలా కనిపెట్టాడో చూడండి..
ABN , Publish Date - Dec 25 , 2025 | 08:08 PM
ఓ వ్యక్తి నీటిలోకి దిగే ఓ నీటి కుంట వద్దకు వెళ్లాడు. అందులో నీరు మొత్తం పచ్చగా రంగు మారి ఉన్నాయి. అయితే ఆ నీటిలో అడుగుపెడితే ఎంత ప్రమాదమో అందరికీ తెలిసేందుకు అతను ఓ ప్రయత్నం చేశాడు.
మొసళ్లు అంటేనే ఒంట్లో భయం మొదలవుతుంది. ఇక పొరపాటున అవి కళ్ల ముందుకు వచ్చాయంటే.. ఇక గుండె ఆగినంత పనవుతుంటుంది. కొన్నిసార్లు కొందరు ప్రమాదవశాత్తు నీళ్లలోకి దిగి మొసళ్ల బారిన పడడం చూస్తుంటాం. మరికొందరు అదృష్టవశాత్తు వాటి నుంచి తృటిలో తప్పించుకుంటుంటారు. ఇంకొందరు నీటిలోకి దిగేముందు తెలివిగా పరీక్షించి మరీ అడుగు పెడుతుంటారు. ఇలాంటి చిత్ర విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నీళ్లలోకి దిగే ముందు కర్ర లోపలికి పెట్టి పరీక్షించాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి నీటిలోకి దిగే ఓ నీటి కుంట వద్దకు వెళ్లాడు. అందులో నీరు మొత్తం పచ్చగా రంగు మారి ఉన్నాయి. అయితే ఆ నీటిలో అడుగుపెడితే ఎంత ప్రమాదమో అందరికీ తెలిసేందుకు అతను ఓ ప్రయత్నం చేశాడు. నీటిలోకి దిగే ముందు అతను పొడవాటి కర్ర తీసుకుని.. నీటిలో పెట్టి అటూ, ఇటూ తిప్పాడు.
ఇలా కొద్ది సేపు చేయగానే లోపల పొంచి ఉన్న పెద్ద మొసలి (crocodile) ఒక్క ఉదుటున పైకి లేచింది. దీంతో అతను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత భయపడకుండా మళ్లీ కర్రతో అటూ, ఇటూ తిప్పాడు. దీంతో ఆ మొసలి మళ్లీ నీటి నుంచి పైకి లేచింది. అదేదో ఆహారం అని భావించిన మొసలి.. కర్రను నోట కరుచుకునే ప్రయత్నం చేసింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మొసలిని భలే కనిపెట్టాడుగా’.. అంటూ కొందరు, ‘ఇతడి తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7,300కి పైగా లైక్‌లు, 1.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..
పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి