Share News

Year End 2025 Viral: ఈ ఏడాది నెట్టింట తెగ ట్రెండ్ అయిన సంఘటనలివే..

ABN , Publish Date - Dec 22 , 2025 | 06:22 PM

2025లో అనేక సంఘటనలు బాగా వైరల్ అయ్యాయి. కొన్ని అయితే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ బాగా వైరల్ అయిన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Year End 2025 Viral: ఈ ఏడాది నెట్టింట తెగ ట్రెండ్ అయిన సంఘటనలివే..

మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. 2025లో అనేక సంఘటనలు బాగా వైరల్ అయ్యాయి. కొన్ని అయితే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ బాగా వైరల్ అయిన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


Kumbh-Mela.jpg

మహా కుంభమేళా

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ వేదికగా జరిగిన మహా కుంభమేళా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అత్యంత వైరల్ అయిన సంఘటనల్లో మొదటి స్థానంలో నిలిచింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వరకూ జరిగిన ఈ వేకులకు భక్తులు రికార్డ్ స్థాయిలో తరలివచ్చారు. కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి తరించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.


3d.jpg

నానో బనానా 3డీ..

ఈ ఏడాది ఏఐ టెక్నాలజీలో నానో బనానా 3డీ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రముఖుల దగ్గర నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ తమ ఫొటోలను గూగుల్‌ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్‌ టూల్‌ సాయంతో సరికొత్తగా మార్చుకున్నారు. ఈ టెక్నాలజీతో తమతో పాటూ తప పెంపుడు జంతువులను సైతం 3డీ రూపంలో మార్చుకోవడం అందరికీ కొత్తగా అనిపించింది. చూసేందుకు ఈ ఫొటోలు చాలా బాగుండడంతో ఈ 3డీ ఫొటోలు తెగ ట్రెండ్ అయ్యాయి.


ఢిల్లీ మెట్రోలో సైలెన్స్ ఛాలెంజ్..

చాలా మంది వివిధ రకాల స్టంట్స్, ప్రాంక్‌లతో పాటూ ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేసి నెట్టింట వైరల్ అవుతుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏమీ చేయకుండానే నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. ఢిల్లీ మెట్రో రైలు ఎక్కిన ఆ వ్యక్తి.. కెమెరా ఆన్ చేసి సైలెంట్‌గా ఉన్నాడు. ఇలా చాలా సేపు ఏమీ మాట్లాడకుండా ఉండడం చూసి మిగతా వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది 6 లక్షలకు పైగా లైక్‌లు, 15.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


19-minits.jpg

19 నిమిషాల వైరల్ వీడియో..

19 మినిట్స్ వీడియో అనే హ్యాష్‌ట్యాగ్ ఎంత ట్రెండింగ్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 19 నిముషాల 34 సెకన్ల ఆ వీడియోలో ఓ జంట గదిలో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కనిపించింది. అలాగే అసభ్యకరంగా మాట్లాడుకుంటున్నారు. ప్రైవేట్ వీడియోలో చూపించిన అమ్మాయి జనాత్ అని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై ఆమె స్పందిస్తూ.. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ స్పష్టం చేసింది. అయితే ఈ వీడియోలోని దృశ్యాలు ఎంత వరకూ కరెక్టో కాదో తెలీదు కానీ.. వీడియో మాత్రం తెగ ట్రెండ్ అయింది. ఈ వీడియోను షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు కూడా హెచ్చరించారు. దీంతో ఆ వీడియో మరింత ట్రెండ్ అయింది.


వందేభారత్ రైల్లో కోతి..

అత్యాధునిక టెక్నాలజీ, అత్యధిక వేగంతో అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రైల్లో అడుగు పెట్టగానే లాక్ అయ్యే డోర్లు మళ్లీ స్టేషన్ వచ్చే వరకూ తెరుచుకోవు. కొన్నిసార్లు కొందరు ఫోటోలు తీసుకునే క్రమంలో రైలు ఎక్కి.. డోర్ లాక్ అవడంతో తర్వాతి స్టేషన్ వరకూ రైల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి కట్టుదిట్టమైన టెక్నాలజీ ఉన్న వందే భారత్ రైలు క్యాబిన్‌లోకి ఓ కోతి ఎక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రైలు క్యాబిన్‌లోకి ఉన్న విషయం తెలీని సిబ్బంది.. లోపలికి వెళ్లాడు. లోపల కోతి ఉండడం చూసి భయంతో కిందకు దిగి దూరంగా పారిపోయాడు. అయితే రైలు ఆగి ఉన్నప్పుడు ఈ ఘటన జరగడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.


women-in-car-with-oldman.jpg

కారులో వృద్ధుడితో యువతి..

రాజస్థాన్ జైసల్మేర్‌లోని తనోట్ ప్రాంతంలో ఓ యువతి 70 ఏళ్ల మేకల కాపరితో కలిసి కారులో శ్రుంగారం చేయడం నెటిజన్లను ఆగ్రహం తెప్పించింది. ఈ ఏడాది మేలో జరిగిన ఈ ఘటన నెట్టింట తెగ వైరల్ అయింది. ఓ వ్యక్తి తన స్నేహితురాలిని ఇలా వృద్ధుడితో శ్రుంగారం చేయించి, ఆ వీడియోను అశ్లీల వెబ్‌సైట్లలో పోస్ట్ చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది.


వేదికపై విద్యార్థులకు టీచర్ సాయం..

ఈ ఏడాది వైరల్ అయిన వీడియోలలో వేదికపై ఓ టీచర్ విద్యార్థులకు డాన్స్ చేయడంలో సాయం చేయడం నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. వేదికపై విద్యార్థులంతా నృత్యం చేస్తున్నారు. వేదిక కింద ప్రేక్షకులకు కనిపించకుండా టీచర్ నిలబడి డాన్స్ చేసి చూపిస్తుంటుంది. ఆమెను చూసి వేదికపై ఉన్న విద్యార్థులు ఎంతో ఈజీగా డాన్స్ చేసేశారు. ఇలా ఆ టీచర్ తన విద్యార్థులకు ప్రోత్సాహించింది. ఈ ఘటన నెటిజన్ల మనసు దోచుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. టీచర్‌ను అభినందనలతో ముంచెత్తారు.


బీఎస్ఎఫ్ సైనికుడి డాన్స్..

బీఎస్ఎఫ్ సైనికుడు వేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. వీడియోలో సైనికుడు బాలీవుడ్ పాట నీచే ఫూలోం కి దుకాన్ ఊపర్ గోరి కా మకాన్’ పాటకు నృత్యం చేశాడు. సదరు సైనికుడు తన డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఇతడి డాన్స్ చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.


విదేశీయురాలి పట్ల అసభ్యకర ప్రవర్తన

రష్యాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌ పట్ల బీచ్‌లో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వీడియో తీస్తుండగా దగ్గరికి వచ్చిన అతను భుజంపై చేయి వేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ యువతి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ వ్యక్తి వెనక్కుతగ్గాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీయుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.


monkey.jpg

ఎలుగుబంటి వేషంలో సర్పంచ్..

తెలంగాణ నిర్మల్ జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ తన గ్రామంలో కోతులను తరిమికొట్టేందుకు చేసిన పని నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి రంజిత్ కోతులను తరిమికొట్టేందుకు ఎలుగుబంటి వేషం వేశాడు. గ్రామంలో కలియతిరుగుతూ కోతులను భయపెట్టాడు. ఎలుగుబంటి వేషంలో ఉన్న ఇతన్ని చూసి కోతులు పరారయ్యాయి. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

Updated Date - Dec 22 , 2025 | 07:00 PM