Home » Year Ender
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేయడం వెనుక ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే ఒక చర్చ సైతం సాగింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసిందనే ప్రచారం నడిచింది.
మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టపోతున్నాం. ఈ సందర్భంగా ఈ ఏడాది ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో బాగా వైరల్ అయిన వీడియోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సంవత్సరం జరిగిన పలు సంఘటనలు అంతర్జాతీయ సంబంధాలను, ప్రపంచ ఆర్థిక వ్యూహాలను ఓ మలుపు తిప్పాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవహరాలు, మారిన అధికార సమీకరణాలు, దీర్ఘకాలిక యుద్ధాలు ఈ ఏడాది ప్రపంచాన్ని పునర్నిర్మించాయని చెప్పక తప్పదు.
ఈ ఏడాది భారత పురుషుల జట్టు రెండు మేజర్ టోర్నీలలో విజేతగా నిలిచింది. అలాగే మహిళా క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఇక, మహిళల అంధ జట్టు కూడా టీ20 ప్రపంచకప్ దక్కించుకుని క్రికెట్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది.
2025లో అనేక సంఘటనలు బాగా వైరల్ అయ్యాయి. కొన్ని అయితే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ బాగా వైరల్ అయిన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఏడాది ముగింపునకు వచ్చిన నేపథ్యంలో జనాలు ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్ టెన్ పదాలు ఏవో తెలుసుకుందాం పదండి.
ముందెన్నడూ చూడని విధంగా 2025 సంవత్సరంలో క్రైమ్ రేట్ తారాస్థాయికి చేరుకుంది. దేశ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసేలా నేరాలు చోటుచేసుకున్నాయి.
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదింపుతూ ఆర్సీబీ కప్పును ముద్దాడింది. ఆ ఎమోషనల్ జర్నీ సాగిందిలా..
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వంటి నేతల నోట వెలువడిన పదాలు జనాన్ని ఉత్సాహపరిచాయి.
Year Ender 2024: 2024 ఏడాది కాంగ్రెస్ పార్టీకే కాదు... ప్రియాంక గాంధీకి సైతం కలిసొచ్చింది. కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో ప్రతిపక్ష హోదా దక్కించుకొంది. ఇక వయనాడ్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంకగాంధీ గెలుపొందారు.