Share News

Top Digital Creators 2025: ఈ ఏడాది టాప్‌లో నిలిచిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు

ABN , Publish Date - Dec 31 , 2025 | 03:18 PM

డిజిటల్ కంటెంట్ క్రియేషన్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. మరి ఈ ఏడాది కంటెంట్ క్రియేషన్ రంగాన్ని ఓ ఊపు ఊపిన టాప్ డిజిటల్ క్రియేటర్లు ఎవరో ఓసారి తెలుసుకుందాం పదండి.

Top Digital Creators 2025: ఈ ఏడాది టాప్‌లో నిలిచిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు
Digital Content Creation 2025

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఈ ఏడాది డిజిటల్ కంటెంట్ క్రియేషన్ రంగం కొత్త పుంతలు తొక్కింది. యూట్యూబ్, సోషల్ మీడియా వేదికల్లో జనాలను ఆకట్టుకునే విషయాలను పంచుకుంటూ కంటెంట్ క్రియేటర్లు మంచి ఆదాయాన్ని పొందారు. తన్మయ్ భట్ మొదలు టెక్నికల్ గురూజీ వరకూ అనేక మంది ఈ ఏడాది తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. మరి ఈ ఏడాది కంటెంట్ క్రియేషన్‌లో టాప్‌లో నిలిచిన డిజిటల్ క్రియేటర్లు ఎవరో ఓ లుక్కేద్దాం (Top Indian Digital Content Creators of 2025).

తన్మయ్ భట్

కమెడియన్‌గా కంటెంట్ క్రియేటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని టాప్‌లో నిలిచిన వ్యక్తి తన్మయ్ భట్. అతడి నికర సంపద విలువ సుమారు రూ.665 కోట్లు. కామెడీని బహుళ వేదికల ద్వారా జనాలకు చేరువ చేసిన క్రెడిట్ తన్మయ్‌దేనని పరిశీలకులు చెబుతారు. పదునైన హాస్య చతురత, టైమింగ్‌లు అతడికి జనాల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టింది.

Tanmay Bhatt.jpg

టెక్నికల్ గురూజీ

టెక్నికల్ గురూజీగా సోషల్ మీడియాలో పాప్యులర్ అయిన గౌరవ్ చౌదరి నికర సంపద విలువ రూ.356 కోట్లు. భారత్‌లో టెక్ రంగంలో ఇతడిది సంపూర్ణ ఆధిపత్యం. సులువైన వివరణలతో టెక్ విషయాలను జనాలతో పంచుకోవడంలో గౌరవ్ దిట్ట.

Technical Guruji.jpg

సమయ్ రైనా

సమయ్ రైనాకు కామెడీ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అతడికి దాదాపు 7.39 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. నికర సంపద విలువ రూ.140 కోట్లు. లైవ్ స్ట్రీమ్స్‌లో తనదైన హాస్య చతురతను జోడించి యువతను తన వైపు తిప్పుకుని దేశంలోని టాప్ కంటెంట్ క్రియేటర్లలో ఒకడిగా నిలిచాడు.

Samay Raina.jpg


క్యారీమినాటీ

రోస్టింగ్ వీడియోలు, కడుపుబ్బా నవ్వించే పంచ్‌ల విషయంలో క్యారీమినాటీకి (అజయ్ నగర్) తిరుగే లేదని అతడి అభిమానులు చెబుతుంటారు. అతడి మొత్తం సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 45.2 మిలియన్‌లు. నికర సంపద విలువ రూ.131 కోట్లు. అతడి పాప్యులారిటీ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

carryminati.jpg

బీబీ కీ వైన్స్

రకరకాల గెటప్‌లు, స్కిట్‌లు, సున్నితమైన హాస్యంతో జనాలకు దగ్గరైన వ్యక్తి భువన్ బామ్. అతడి యూట్యూబ్ ఛానల్ బీబీకీ వైన్స్‌కు సుమారు 26.6 మిలియన్ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. నికర సంపద విలువ రూ.122 కోట్లు.

BB Ki Vines.jpg

ట్రిగర్డ్ ఇన్సాన్

రోస్టు వీడియోలు, రియాక్షన్ వీడియోలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి నిశ్చయ్ మల్హన్. ట్రిగర్డ్ ఇన్సాన్‌గా నెట్టింట యమాగా పాప్యులర్. డిజిటల్ కంటెంట్ క్రియేషన్‌తో అతడి నికర సంపద విలువ రూ.65 కోట్లకు చేరింది. ఈ రంగంలో ఎంత పోటీ ఉన్నా క్రమం తప్పకుండా సృజనాత్మకమైన వీడియోలు అప్‌లోడ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు.

Triggered Insaan.jpg

ధ్రువ్ రాఠీ

భారత్ డిజిటల్ కంటెంట్ రంగంలో ప్రత్యేక పరిచయమే అవసరం లేని పేరు ధ్రువ్ రాఠీ. సమకాలీన రాజకీయ అంశాలపై అతడు చేసే వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. ప్రస్తుతం అతడి నికర సంపద విలువ రూ.60 కోట్లు. రాజకీయాలతో పాటు పర్యావరణం, అంతర్జాతీయ వ్యవహారాలపై అతడు చేసే వీడియోలు నిత్యం చర్చనీయాంశం అవుతుంటాయి.

Dhruv Rathee.jpg


బీర్ బైసెప్స్

బీర్ బైసెప్స్ ఛానల్‌లో ఇంటర్వ్యూలు, పాడ్ కాస్ట్‌ల ద్వారా పాప్యులారిటీ పొందిన వ్యక్తి రణ్‌వీర్ అల్హాబాదియా. సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు, వ్యక్తిగత అభివృద్ధి, ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలతో తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను సృష్టించుకోగలిగాడు. అతడి సంపద నికర విలువ రూ.58 కోట్లని సమాచారం.

beer biceps.jpgసౌరవ్ జోషీ

వ్లాగర్‌గా సౌరవ్ జోషి నెట్టింట సుపరిచితుడు. అతడి నికర సంపద విలువ రూ.50 కోట్లు. ప్రస్తుతం భారత్‌లో లైఫ్‌‌స్టైల్ సంబంధిత కంటెంట్ క్రియేటర్లలో సౌరవ్ టాప్‌లో ఉన్నాడు. కుటుంబ విలువలే కేంద్రంగా అతడు చేసే వీడియోలు నిత్యం ట్రెండింగ్‌లో ఉంటుంటాయి. అతడి నికర సంపద విలువ రూ.50 కోట్లని సమాచారం.

saurav joshi.jpg


ఇవీ చదవండి:

అంతరిక్ష రంగం.. ఇస్రో సారథ్యంలో భారత్‌కు అద్భుత విజయాలు

ఈ ఏడాది శాస్త్రసాంకేతిక రంగాల్లో అద్భుతాలు.. ఆశ్చర్యపోవాల్సిందే

Updated Date - Dec 31 , 2025 | 03:25 PM