Indian stock market 2025: 2025లో భారత స్టాక్ మార్కెట్లు ఎంత లాభాలను అందించాయంటే..
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:26 PM
2025లో ట్రంప్ ప్రతికార సుంకాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, రూపాయి పతనం వంటి పలు ఇతర సమస్యలు దేశీయ స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఇన్ని ప్రతికూలతల నడుమ కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపర్లకు లాభాలనే అందించాయి.
ఈ ఏడాది ప్రారంభంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ఆయన ప్రతీకార సుంకాల పేరుతో పలు దేశాలపై వాణిజ్య యుద్ధాలకు తెర తీశారు. భారత్‌పై ఏకంగా 50 శాతం పన్నులు విధించారు. మరోవైపు విదేశీ మదుపర్ల అమ్మకాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, రూపాయి పతనం వంటి పలు ఇతర సమస్యలు కూడా స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఇన్ని ప్రతికూలతల నడుమ కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపర్లకు లాభాలనే అందించాయి (stock market performance India 2025).
2025 క్యాలెండర్ సంవత్సరంలో బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ 8 శాతం పెరిగింది. మదుపర్లకు ఏకంగా రూ.30.20 లక్షల కోట్ల లాభాలను అందించింది. దేశీయ మదుపర్ల కొనుగోళ్ల కారణంగా బీఎస్‌ఈ ఈ స్థాయి ప్రతిఫలాలను అందించగలిగింది. ఈ ఏడాదిలో డిసెంబర్ 29 వరకు సెన్సెక్స్ 8.39 శాతం వృద్ధి సాధించింది. ఈ సంవత్సరంలో సెన్సెక్స్ 6, 556 పాయింట్లు ఎగబాకింది. డిసెంబర్ 1వ తేదీన సెన్సెక్స్ 86, 159 పాయింట్లకు చేరుకుని ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది (Sensex performance 2025).

మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల విలువ 2025 డిసెంబర్ 29 నాటికి రూ.472 లక్షల కోట్లకు చేరింది. గతేడాదితో పోల్చుకుంటే ఇది రూ.30 లక్షల కోట్లు అధికం. అయితే 2024, 2023 సంవత్సరాలతో పోల్చి చూసుకుంటే ఇది కాస్త తక్కువనే చెప్పాలి. 2024లో బీఎస్‌ఈ నమోదిత కంపెనీల విలువ రూ.77.66 లక్షల కోట్లు వృద్ధి చెందింది. అలాగే 2023లో బీఎస్‌ఈ నమోదిత కంపెనీల విలువ రూ.81.90 లక్షల కోట్లు వృద్ధి సాధించింది (Indian share market analysis).

ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు సుమారు 1.6 లక్షల కోట్ల రూపాయలు వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ దేశీయ మదుపర్లు బలమైన మద్దతుగా నిలవడం, ప్రభుత్వ మూలధన వ్యయం, స్థిరమైన వృద్ధి.. దేశీయ ఈక్వెటీ మార్కెట్లను ఆదుకుని నిలబెట్టాయి. అలాగే టాటా క్యాపిటల్, హెచ్‌డీబీ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, లెన్స్‌కార్ట్, వంటి భారీ ఐపీఓలు కూడా స్టాక్ మార్కెట్లు పెరగడానికి దోహదపడ్డాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సిప్ ఇన్వెస్ట్‌మెంట్లు కూడా పెరిగాయి (India equity market outlook).

ఇక, ఈ ఏడాది అత్యధిక మార్కెట్ విలువ కలిగిన కంపెనీల జాబితాలో రిలయన్స్ (రూ. 20, 91, 173 కోట్లు) అగ్రస్థానంలో నిలిచింది. రిలయన్స్ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (రూ.15, 25, 457 కోట్లు), భారతీ ఎయిర్‌టెల్ (రూ. 11, 86, 978 కోట్లు), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ. 11, 77, 199 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ. 9, 60, 478 కోట్లు) ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు సలాం చెప్పాల్సిందే.. పెళ్లి వేదిక దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో నాలుగో పిల్లిని 7 సెకెన్లలో కనిపెట్టండి..