Share News

Blinkit delivery: బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు సలాం చెప్పాల్సిందే.. పెళ్లి వేదిక దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే..

ABN , Publish Date - Dec 30 , 2025 | 03:14 PM

పెళ్లిళ్లలో చేసే పూజలు, పాటించే ఆచారాలను అందరూ కీలకంగా తీసుకుంటారు. ఆయా కార్యక్రమాలకు అవసరమైన అన్ని వస్తువులను జాగ్రత్తగా పెట్టుకుంటారు. పెళ్లి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైదని సిందూరం. దానినే మర్చిపోయారు వధువు కుటుంబ సభ్యులు.

Blinkit delivery: బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు సలాం చెప్పాల్సిందే.. పెళ్లి వేదిక దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే..
Blinkit wedding story

వివాహం వంటి పెద్ద వేడుకల్లో చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద గందరగోళానికి కారణమవుతాయి. పెళ్లిళ్లలో చేసే పూజలు, పాటించే ఆచారాలను అందరూ కీలకంగా తీసుకుంటారు. ఆయా కార్యక్రమాలకు అవసరమైన అన్ని వస్తువులను జాగ్రత్తగా పెట్టుకుంటారు. పెళ్లి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైదని సిందూరం. దానినే మర్చిపోయారు వధువు కుటుంబ సభ్యులు. అయితే ఆ గందరగోళాన్ని ఓ బ్లింకిట్ డెలివరీ నిమిషాల వ్యవధిలో పరిష్కరించాడు (forgot sindoor at wedding).


vogueshaire అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. ఢిల్లీకి చెందిన పూజా, హృషి అనే జంట వివాహం ఘనంగా జరుగుతోంది. వేద మంత్రాల మధ్య సప్తపది కూడా పూర్తయింది. ఇక చివరగా వధువు నుదుట వరుడు సిందూరం దిద్దాల్సిన సమయం వచ్చింది. అయితే ఆ సమయానికి సిందూరం ఎక్కడా కనబడలేదు. సిందూరం తీసుకురావడం మర్చిపోయారు. ముహుర్త సమయం దాటిపోతుండటం, బయటకు వెళ్లి తీసుకురావాలంటే ట్రాఫిక్ వల్ల ఆలస్యం అవుతుందని ఆందోళన మొదలైంది (Blinkit delivery in 16 minutes).


ఆ సమయంలో వధువు కుటుంబ సభ్యులకు ఒక ఐడియా వచ్చింది (Blinkit saves the day). వెంటనే ఫోన్ తీసి బ్లింకిట్ యాప్‌లో సిందూరం ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన కేవలం 16 నిమిషాల వ్యవధిలోనే బ్లింకిట్ డెలివరీ బాయ్ సిందూరం తీసుకుని నేరుగా కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నాడు. డెలివరీ ఏజెంట్ రాగానే అతిథులందరూ హర్షధ్వానాలు చేశారు. ఆ సిందూరాన్ని తీసుకుని వరుడు పెళ్లి తంతును విజయవంతంగా ముగించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి..

ఇది రైలా లేక మిసైలా.. గంటకు 700 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ రైలు గురించి తెలుసా..


వైద్య ప్రపంచంలోనే అద్భుతం.. పాదం మీద చెవి పెట్టి కాపాడారు..

Updated Date - Dec 30 , 2025 | 03:14 PM