Viral Food Video: ఒకే రోటీలో మూడు రుచులు.. మహిళ ప్రయోగం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Dec 27 , 2025 | 06:47 PM
ఓ మహిళ రోటీ తయారు చేస్తోంది. ఇందులో విశేషమేమీ లేకున్నా.. ఆమె రోటీ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఎవరైనా రోటీని ఒకే రమైన పిండితో తయారు చేస్తారు. కానీ ఈమె మాత్రం మూడు రకాల పిండితో ఒకే రోటీ చేసింది..
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఇంట్లో పని చేసే మహిళలు మొదలుకొని లక్షల జీతాలు తీసుకునే ఉద్యోగుల వరకూ ప్రతి ఒక్కరూ తమ దినచర్యను వీడియోలుగా మార్చి సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. కొందరు ఇదే వీడియోల ద్వారా రెండో ఆదాయాన్ని కూడా సృష్టించుకుంటున్నారు. ఇక మహిళల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో వంట పని దగ్గర నుంచి పెరట్లో మట్టి పని వరకూ చిన్న చిన్న సంఘటనలను సైతం రీల్స్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇలాంటి వీడియోలను నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ చేసిన రోటీ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. 3 ఇన్ 1 రోటీ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ రోటీ తయారు చేస్తోంది. ఇందులో విశేషమేమీ లేకున్నా.. ఆమె రోటీ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఎవరైనా రోటీని ఒకే రమైన పిండితో తయారు చేస్తారు. కానీ ఈమె మాత్రం మూడు రకాల పిండితో (Three types of flour) ఒకే రోటీ చేసింది. మొక్కజొన్న, మిల్లెట్, బియ్యం పిండిని వేర్వేరుగా కలిపి ఉండలుగా చేసింది. మూడింటిని గుండ్రంగా చేసింది. చూసేందుకు ఈ రోటీ మూడు రంగుల్లో విభిన్నంగా కనిపించింది. తర్వాత యథావిధిగా ఆ రోటీని పెనంపై వేడి చేసింది.
ఇలాంటి ప్రయోగం ఇప్పటివరకు ఎవరూ చేయకపోవడంతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ రోటీ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘రంగు రంగు డిజైన్లలో రోటీ’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27 వేలకు పైగా లైక్‌లు, 1.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పులికి భయం అంటే ఏంటో చూపించిందిగా.. నీళ్లు తాగడానికి వెళ్లగానే..
కొండపై దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు.. సడన్‌గా దూసుకొచ్చిన సింహం.. చివరకు చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..