Watch Viral Video: వెంట్రుకవాసిలో బతికిపోయాడు.. ఫోన్ ఎంత పని చేసిందో చూడండి..
ABN , Publish Date - Dec 26 , 2025 | 09:34 PM
ఓ వ్యక్తి ఫోన్‌లో పాటలు వింటూ తాపీగా నడుస్తూ వస్తున్నాడు. మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎవరైనా పట్టాలపై అటూ, ఇటూ చూసి దాటేస్తారు. అయితే ఈ వ్యక్తి మాత్రం పాటలు వింటూ నేరుగా పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. అయితే ..
ప్రస్తుత సమాజంలో ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫోన్ పిచ్చిలో కొందరు చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇంకొందరు ఫోన్ ధ్యాసలో పడిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చివరకు తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలో పడేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఫోన్‌లో పాటలు వింటూ ప్రమాదం అంచుల వరకూ వెళ్లాడు. ఇంతకీ అసలేమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఫోన్‌లో పాటలు వింటూ తాపీగా నడుస్తూ వస్తున్నాడు. మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ (Railway tracks) దాటాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎవరైనా పట్టాలపై అటూ, ఇటూ చూసి దాటేస్తారు. అయితే ఈ వ్యక్తి మాత్రం పాటలు వింటూ నేరుగా పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. అయితే తీరా పట్టాలు దాటుతుండగా.. రైలు వేగంగా అటువైపు దూసుకొచ్చింది. అతడికి అత్యంత సమీపంలో దూసుకెళ్లింది.
ఆ సమయంలో ఒక్క అంగుళం ముందుకు కదిలినా రైలు ఢీకొని ప్రాణాలు పోగొట్టుకునేవాడు. రైలు అత్యంత సమీపం నుంచి దూసుకెళ్లడంతో భయపడ్డ ఆ వ్యక్తి.. ఆ తర్వాత దూరంగా వెళ్లిపోయాడు. ఆ సమయంలో కొంచెం అటు, ఇటూ అయినా అతడి ప్రాణాలే పోయేవి. అయితే అతడికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వెంట్రుకవాసిలో ప్రాణాలతో బయటపడడం అంటే ఇదేనేమో’.. అంటూ కొందరు, ‘ఫోన్ పిచ్చిలో పడితే ఇలాగే ఉంటుంది మరి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పులికి భయం అంటే ఏంటో చూపించిందిగా.. నీళ్లు తాగడానికి వెళ్లగానే..
కొండపై దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు.. సడన్‌గా దూసుకొచ్చిన సింహం.. చివరకు చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..