Share News

Jugaad Viral Video: హెల్మెట్ గ్లాస్‌పై పొగమంచు పడుతోందా.. ఇతను చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Dec 27 , 2025 | 09:30 PM

బైకుపై వెళ్లే సమయంలో హెల్మెట్ అద్దంపై పొగమంచు పడడం సర్వసాధారణం. ఇలాంటి సందర్భంగా ఎవరైనా ఏం చేస్తారంటే.. బైకును ఆపి, చేత్తోనో లేదా క్లాత్‌ తీసుకుని హెల్మెట్ అద్దాన్ని శుభ్రం చేస్తారు. అయితే ఈ వ్యక్తి అలా చేయకుండా వింత పరిష్కారం కనుక్కున్నాడు..

Jugaad Viral Video: హెల్మెట్ గ్లాస్‌పై పొగమంచు పడుతోందా.. ఇతను చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..

చలికాలం వచ్చిందంటే చలి తీవ్రతతో పాటు డ్రైవర్లు ఎదుర్కొనే మరో పెద్ద సమస్య అద్దాలపై పొగమంచు పడడం. దారి స్పష్టంగా కనిపించిక కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ వ్యక్తి హెల్మెట్‌పై చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. కార్లు, బస్సుల్లో అయితే వైపర్ బ్లేడ్‌లతో అద్దాలు శుభ్రం చేయొచ్చు. కానీ బైకుపై వెళ్లేటప్పుడు హెల్మెట్‌పై పొగమంచు పడితే ఎలా చేయాలి. దీనికి పరిష్కారంగా సదరు వ్యక్తి ఏం చేశాడో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బైకుపై వెళ్లే సమయంలో హెల్మెట్ అద్దంపై పొగమంచు (Fog on Helmet) పడడం సర్వసాధారణం. ఇలాంటి సందర్భంగా ఎవరైనా ఏం చేస్తారంటే.. బైకును ఆపి, చేత్తోనో లేదా క్లాత్‌ తీసుకుని హెల్మెట్ అద్దాన్ని శుభ్రం చేస్తారు. అయితే ఈ వ్యక్తి అలా చేయకుండా వింత పరిష్కారం కనుక్కున్నాడు. ఇందుకోసం అతను రూపాయి కూడా ఖర్చు చేయకుండా సింపుల్ ట్రిక్ వాడాడు.


ఓ పాత టూత్ బ్రష్, కొద్దిగా స్పాంజ్ తీసుకున్నాడు. బ్రష్‌ చివరన స్పాంజ్‌ను అంటించాడు. తర్వాత టూత్ బ్రష్‌ను స్క్రూ సాయంతో హెల్మెట్‌కు ఫిట్ చేశాడు. ఫైనల్‌గా దాన్ని చివర పట్టుకుని అటూ, ఇటూ తిప్పడం ద్వారా హెల్మెట్ అద్దం శుభ్రం అయ్యేలా సెట్ చేశాడు. ఇతడి ప్రయోగం చూసి కొంతమంది ఆశ్చర్యపోతుండగా, మరికొందరు ఇది వర్కవుట్ కాదు.. కేవలం వ్యూస్ కోసం పనికొస్తుందంటూ కొట్టిపారేస్తున్నారు.


ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కొత్త ఆలోచన అన్‌లాక్ అయింది’.. అంటూ కొందరు, ‘చాలా మంచి ఐడియా‘ అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.87 లక్షలకు పైగా లైక్‌లు, 34 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

పులికి భయం అంటే ఏంటో చూపించిందిగా.. నీళ్లు తాగడానికి వెళ్లగానే..

కొండపై దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు.. సడన్‌గా దూసుకొచ్చిన సింహం.. చివరకు చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 27 , 2025 | 09:30 PM