Train Stunt Video: వామ్మో.. రైల్వే గేట్ వద్ద ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా.. వీళ్ల నిర్వాకం చూస్తే..
ABN , Publish Date - Dec 27 , 2025 | 08:43 PM
రైలు వస్తుండడంతో గేటు వేశారు. దీంతో గేటుకు రెండు వైపులా వాహనాలు ఆగిపోయాయి. అయితే గేటు అవతలి వైపు ముగ్గురు మహిళలు నిలబడి ఉన్నారు. తీరా రైలు సమీపానికి రాగానే వారు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..
సోషల్ మీడియా ప్రపంచంలోకి ఒక్కసారి వెళ్తే ఒక అంత సులభంగా బయటికి రాలేం. వీడియోను మించి వీడియోలు దర్శనమిస్తుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. మరికొందరు జీవన పోరాటంలో భాగంగా ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట దర్శనమిస్తోంది. ముగ్గురు మహిళలు రైలు ఎక్కే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైలు వస్తుండడంతో గేటు వేశారు. దీంతో గేటుకు రెండు వైపులా వాహనాలు ఆగిపోయాయి. అయితే గేటు అవతలి వైపు ముగ్గురు మహిళలు నిలబడి ఉన్నారు. తీరా రైలు సమీపానికి రాగానే ఒక్కొక్కరుగా బోగీలోకి ఎక్కేశారు. కదులుతున్న రైలును.. డోరు పక్కన ఉన్న ఇనుప రాడ్ పట్టుకుని లోపలికి ఎక్కేశారు.
ఆ సమయంలో ఏమాత్రం అటూ, ఇటూ అయినా ప్రాణాలే పోయేవి. అయితే ఆ ముగ్గురూ ఎంతో చాకచక్యంగా రైలు ఎక్కేశారు. వారు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కయ్యారు. బతుకుతెరువులో భాగంగా సాహసాలు చేసి మరీ రైలు ఎక్కారు. ఆ సమయంలో వారిలో కొంచెం కూడా భయం కనిపించదు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ మహిళలు మరణంతో పోటీపడుతున్నారు’.. అంటూ కొందరు, ‘ఇలాంటి విన్యాసాలు ఎంతో ప్రమాదకరం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త రాసే సమయానికి 2,100కి పైగా లైక్‌లు, 5.76 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పులికి భయం అంటే ఏంటో చూపించిందిగా.. నీళ్లు తాగడానికి వెళ్లగానే..
కొండపై దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు.. సడన్‌గా దూసుకొచ్చిన సింహం.. చివరకు చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..