Share News

Cheetah Funny Video: బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..

ABN , Publish Date - Dec 28 , 2025 | 07:27 PM

చెరువులోని బురదలో ఓ చిరుతపులి ఆహారం కోసం వెతుకుతోంది. నెమ్మదిగా కదులుతూ, గోళ్లతో బురదను గీస్తూ.. చేపలేమైనా కనిపిస్తే తినేయాలని చూస్తోంది. అయితే ఈ సమయంలో ఉన్నట్లుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

Cheetah Funny Video: బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..

వేట అంటేనే చిరుత గుర్తొస్తుంది. వేగంలో అయినా వేటలో అయినా దీనికి మించిన జంతువు లేదంటే అతిశయోక్తి కాదు. అయితే కొన్నిసార్లు చిరుత కూడా షాక్ అయ్యే సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు భయంతో పారిపోయే పరిస్థితి కూడా ఎదురవుతుంటుంది. ఇలాంటి సందర్భాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ చిరుత బురదలో ఆహారం కోసం వెతుకుతుంటుంది. ఆ సమయంలో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చెరువులోని బురదలో ఓ చిరుతపులి ఆహారం (Leopard Searching For Food in Mud) కోసం వెతుకుతోంది. నెమ్మదిగా కదులుతూ, గోళ్లతో బురదను గీస్తూ.. చేపలేమైనా కనిపిస్తే తినేయాలని చూస్తోంది. అయితే ఈ సమయంలో ఉన్నట్లుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చిరుత కాస్త దూరంలో ఓ హిప్పో బురదలో మునిగి ఉంటుంది.


చిరుతను చూసి అది ఒక్కసారిగా బురదలో నుంచి (Hippo tries to attack cheetah) బయటికి వచ్చింది. హిప్పోను చూడగానే చిరుత ఒక్కసారిగా షాక్ అయి.. దూరంగా పారిపోతుంది. చిరుతను చూసి హిప్పో దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే హిప్పో కాస్త కదలగానే.. చిరుత ఆ చుట్టుపక్కల కనిపించకుండా పారిపోతుంది.


ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చిరుతకు చుక్కలు చూపించిన హిప్పో’.. అంటూ కొందరు, ‘అడవిలో ఎవరు బాస్ అనేది ఎప్పుడూ ఊహించలేం’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3800కి పైగా లైక్‌లు, 6.27 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

హెల్మెట్ గ్లాస్‌పై పొగమంచు పడుతోందా.. ఇతను చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..

పులికి భయం అంటే ఏంటో చూపించిందిగా.. నీళ్లు తాగడానికి వెళ్లగానే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 28 , 2025 | 07:27 PM