Woman Viral Video: ఫొటో కంటే ప్రాణం ముఖ్యం.. ఈ యువతికి ఏమైందో చూడండి..
ABN , Publish Date - Dec 28 , 2025 | 06:28 PM
ఈ వీడియో చూస్తే నిజంగానే గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఓ పర్యాటక ప్రదేశంలో ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. నారింజ రంగు సమ్మర్ డ్రెస్ వేసుకున్న యువతి ఫొటోలు తీసుకుంటోంది. ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఫొటోలు, సెల్ఫీల కోసం కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తున్నాం. ప్రమాదమని తెలిసినా కూడా చాలా మంది సాహసాలు చేసి మరీ సెల్ఫీలు తీసుకుంటుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి సముద్రం ఒడ్డున ఫొటోలు తీసుకుంటుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే నిజంగానే గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఈ ఘటన ఈజిప్ట్‌లో (Egypt) చోటు చేసుకుంది. స్థానిక మెర్సా మాత్రూహ్ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశంలో ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. నారింజ రంగు సమ్మర్ డ్రెస్ వేసుకున్న అందమైన చైనీస్ యువతి (Chinese woman) .. సముద్రం ఒడ్డున కూర్చుని ఫొటోలకు ఫోజులు ఇస్తోంది. ప్రమాదమని తెలిసినా రాళ్ల అంచున ప్రమాదకరంగా కూర్చొంది.
ఇలా ఫొటోలకు ఫోజులు ఇస్తుండగా.. ఉన్నట్టుండి ఓ పెద్ద అల వచ్చి పెడేల్‌మని తాకింది. దెబ్బకు ఆ యువతి రాళ్లపై నుంచి దూరంగా పడిపోయింది. అయితే అక్కడ ఉన్న సేఫ్టీ తాడు పట్టుకోవడంతో ప్రాణాలో బయటపడింది. లేదంటే అలల దాటికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయేది. ఈ ఘటనలో ఆమెకు గాయాలతో బయటపడినట్లు తెలిసింది. ఈ ఘటన అందరికీ హెచ్చరికగా నిలుస్తోంది.
ప్రదేశం అందంగా ఉన్నంత మాత్రాన సాహసాలు చేసి మరీ ఫొటోలు తీసుకోవడం ఎంత ప్రమాదమో ఈ ఘటన చూస్తే తెలుస్తో్ంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఫొటోల కోసం ఇలాంటి పనులు చేయొద్దు’.. అంటూ కొందరు, ‘టూర్‌లకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
హెల్మెట్ గ్లాస్‌పై పొగమంచు పడుతోందా.. ఇతను చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..
పులికి భయం అంటే ఏంటో చూపించిందిగా.. నీళ్లు తాగడానికి వెళ్లగానే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..